Breaking News

అర్జీల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించి సకాలంలో పరిష్కరించాలి…

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజల నుండి అందే అర్జీల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించి సకాలంలో పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. సోమవారం నగరంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ సంయుక్త కలెక్టర్ గీతాంజలి శర్మ డిఆర్ఓ చంద్రశేఖర రావు తో కలిసి ప్రజా సమస్యల పరిష్కార వేదిక – మీకోసం కార్యక్రమం నిర్వహించి వివిధ ప్రాంతాల ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. మొత్తం 140 అర్జీలు జిల్లా యంత్రాంగం స్వీకరించింది. అందులో కొన్నింటి అర్జీల వివరాలు ఇలా ఉన్నాయి:

-మండల కేంద్రమైన చల్లపల్లి గ్రామం కాపురస్తులు భూసం చంద్రశేఖర రావు మాట్లాడుతూ తనకు కొత్త మాజేరు గ్రామంలో ఒక ఎకరం 24 సెంట్లు మాగాణి భూమి కలదని సెప్టెంబర్ లో ఈ పంట నమోదు చేసిన సమయంలో ఫోర్జరీ చేసినట్లు తన దృష్టికి వచ్చిందని బాధ్యులైన వారి పైన తగిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు

-గూడూరు మండలం మల్లవోలు గ్రామానికి చెందిన బండారు వెంకట శ్రీనివాసరావు తనకు రీ సర్వే నంబర్ 295-1 డ్యాన్స్ ఒకటిలో 108.5 చదరపు గజాల్లో నివేశన స్థలం కలదని ఆ స్థలం వెనుక సరిహద్దుదారులు అయిన దేసు రంగారావుతో సరిహద్దు సమస్య ఏర్పడి చాలా ఇబ్బందులు పడుతున్నామని గతంలో మూడుసార్లు సర్వే కోసం అర్జీ ఇచ్చామని ఇకనైనా తనకు న్యాయం చేయాలని కోరుతూ అర్జీ అందజేశారు.

-గన్నవరం మండలం కేసరపల్లి గ్రామం వైఎస్ఆర్ పురం కాలనీ కాపురస్తులు దాసరి పద్మ మాట్లాడుతూ తాను దివ్యాంగురాలునని, తన భర్త మరణించారని, కుటుంబ పోషణకు కష్టంగా ఉందని, గతంలో తాను కూరగాయల వ్యాపారం చేసే దాన్నని ప్రస్తుతం గన్నవరం రైతు బజార్లో అద్దెకు షాపు కేటాయిస్తే కూరగాయల వ్యాపారం చేసుకుంటానని తనను ఆదుకోవాలని కోరుతూ వినతి పత్రం అందజేశారు.

-మండల కేంద్రమైన మొవ్వ గ్రామానికి చెందిన సంకుల గోపి మాట్లాడుతూ తాను అంబేద్కర్ నగర్ మెయిన్ రోడ్డులో మరమ్మతు పనులు సుమారు 3.38 లక్షల రూపాయల ఖర్చుతో పూర్తి చేశానని సంవత్సరం దాటిన ఆ బిల్లు ఇంకను చెల్లించలేదని పలు అధికారులు దృష్టికి తీసుకువెళ్లిన ఏమి ప్రయోజనం లేదని ఇప్పుడైనా తమరు ఆ బిల్లు మంజూరయ్యేలా చూడాలని విజ్ఞప్తి చేశారు.

-మండల కేంద్రమైన నాగాయలంక తూర్పు బజారు చెందిన ప్రజలు టి రవిబాబు, ఉప్పల శ్రీనివాసరావు, టీవీ శ్రీనివాస్ తదితరులు మాట్లాడుతూ ట్రాక్టర్లతో, ధాన్యము వరిగడ్డి తోలుకొనుటకు విశాలమైన రోడ్డు ఉండేదని, ఒక రెవిన్యూ ఉద్యోగి రేకుల షెడ్డు నిర్మించుకొని రోడ్డును ఆక్రమించారని దాన్ని తొలగించాలని ఫిర్యాదు చేశారు.

-ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు సంఘం, రైతు సంఘం కృష్ణా జిల్లా కమిటీల జిల్లా కార్యదర్శులు పి. రంగారావు, గౌరీశెట్టి నాగేశ్వరరావు ప్రతినిధులు కే శివ నాగేశ్వరరావు, లక్ష్మణరావు తదితరులు మాట్లాడుతూ ఇటీవల జిల్లాలో కురిసిన భారీ వర్షాలు సంభవించిన వరదల కారణంగా దెబ్బతిన్న రైతులు, కౌలు రైతులను ఆదుకోవాలన్నారు. ముఖ్యంగా వరికి ఎకరానికి 25 వేల రూపాయల నష్టపరిహారం అందించాలని, కంద,పసుపు తదితర వాణిజ్య పంటలకు లక్ష రూపాయల నష్టపరిహారం ఇవ్వాలని, భూమి స్వభావంతో సంబంధం లేకుండా ప్రతి పంటను ఈ క్రాప్ నమోదు చేయాలని, నష్టపరిహారం అందించాలని, పాడైపోయిన మోటార్లను ఆయిల్ ఇంజిన్ లను ట్రాక్టర్లను ఉచితంగా మరమ్మతు చేయించాలని ఇసుక మేట వేసిన భూములను ప్రభుత్వమే బాగు చేయించాలని, రెండవ పంట వేసుకొనుటకు మినుము, మొక్కజొన్న విత్తనాలను ఉచితంగా సరఫరా చేయాలని, జే ఎల్ జి, ఆర్ఎం జి, సిసిఆర్సి రుణాలను రద్దు చేయాలని, డ్వాక్రా మహిళల రుణాలను కనీసం 3 నెలలపాటు మారిటోరియం విధించాలని కోరుతూ అర్జీ అందజేశారు.

అంతకు ముందు జిల్లా కలెక్టర్ జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించి మీకోసం అర్జీలు, ముఖ్యమంత్రి కార్యాలయం నుండి వచ్చిన అర్జీలు, కోర్టు కేసులను సమీక్షించారు.

మొత్తం 3,841 అర్జీలు రాగా ఇప్పటివరకు 627 అర్జీలు ఇంకా పెండింగ్లో ఉన్నాయన్నారు.

గడువు దాటిన అర్జీలు 11 ఉన్నాయని, వాటిలో రెవెన్యూ 5, పోలీస్ 5, జలవనరుల శాఖ ఒకటి గ్రామ వార్డు సచివాలయాలు ఒకటి పెండింగ్లో ఉన్నాయన్నారు. వాటన్నిటిని తక్షణమే పరిష్కరించాలన్నారు.

ముఖ్యమంత్రి కార్యాలయం నుండి వచ్చిన అర్జీలలో డీఎస్ఓ 4 డిపిఓ 3 ఇంకా పెండింగ్లో ఉన్నాయని వాటిని కూడా తక్షణమే పరిష్కరించాలన్నారు.

అక్టోబర్ 1 వ తేదీన మంగళవారం పింఛన్ల పంపిణీ కోసం ముందుగానే బ్యాంకుల నుండి డబ్బులు డ్రా చేసుకున్నారా లేదా, పంపిణీకి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయా లేదా అని డిపిఓను కలెక్టర్ విచారించారు.

కోర్టు కేసులకు సంబంధించి 4 వకాలత్ దాఖలు చేయాలని ఆర్డబ్ల్యూఎస్, మున్సిపల్ అధికారులు వెంటనే కౌంటర్లు దాఖలు చేయాలన్నారు.

జలవనరుల శాఖ అధికారులు కౌంటర్లు దాఖలు చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని జిల్లా కలెక్టర్ ను బాధ్యులుగా చేసి కోర్టుకు హాజరయ్యే పరిస్థితి తీసుకోని వచ్చే పక్షంలో ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో కె ఆర్ ఆర్ సి ఎస్ డి సి జి శ్రీదేవి, డిఎస్ఓ పార్వతి, డిఎంహెచ్వో డాక్టర్ గీతా బాయి, జెడ్పిసిఈఓ కె కన్నమ నాయుడు డిపిఓ అరుణ, డీఈవో తహేరా సుల్తానా, జిల్లా వ్యవసాయ అధికారి ఎన్ పద్మావతి, సిపిఓ గణేషు, డి టి డబ్ల్యూ ధూర్జటి ఫణి, జిల్లా ఉద్యాన అధికారి జే జ్యోతి పిడి విజయలక్ష్మి మున్సిపల్ కమిషనర్ బాపిరాజు తదితర జిల్లా అధికారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *