Breaking News

“ఇన్వైట్ యువర్ కమిషనర్”

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
స్వచ్ఛత హి సేవ కార్యక్రమంలో భాగంగా ఇన్వైట్ యువర్ కమిషనర్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు విజయవాడ నగరపాలక సంస్థ. సోమవారం, ఈ విషయాన్ని ఒక పోస్టర్ ద్వారా సామాజిక మాధ్యమం ద్వారా తెలియపరిచారు. ఇందులో భాగంగా ప్రజలు వారు చేస్తున్న స్వచ్ఛత కార్యక్రమాలు అనగా ఇంటి వద్దనే ఎరువులు తయారు చేయటం (హోమ్ కంపోస్టింగ్ ), RRR, టెర్రస్ గార్డెన్, విజయవాడ స్వచ్ఛతలో పాలుపంచుకోటం వంటి అంశాల తో విజయవాడ నగరపాలక సంస్థ వారు విడుదల చేసిన పోస్టర్లో ఉన్న క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి వారు చేసిన స్వచ్ఛత కార్యక్రమాలను అందులో జతపరిచాల్సి ఉంటుంది. విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఉత్తమ కార్యక్రమాన్ని ఎంపిక చేసి, వారి వద్దకు వెళ్లి, వారు చేసిన పనిని ప్రశంసించటమే కాకుండా ఒక బహుమతిని అందిస్తారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *