-రాయచోటి నియోజకవర్గంలో మైనార్టీ సోదరుల అభ్యున్నతిపై చర్చ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మైనారిటీల సామాజిక ఆర్థికాభివృద్ధి, విద్యాపరమైన పురోగతి ద్వారా వారి సంక్షేమం వేగవంతం చెయ్యడం కోసం రాయచోటి నియోజకవర్గం లో మైనార్టీ పరంగా ఉన్న పలు సమస్యలను విజయవాడలోని మైనార్టీ శాఖ మంత్రి ఫరూఖ్ గారితో రాష్ట్ర రవాణా యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సమావేశమై ఆయన దృష్టికి పలు సమస్యలను తెలిపారు. రాయచోటి నియోజకవర్గంలో షాది ఖానా ఏర్పాటు చేయాలని , మైనారిటీ వర్గాలకు …
Read More »Monthly Archives: October 2024
అమరావతి డ్రోన్ సమ్మిట్-2024 విజయవంతానికి విస్తృత ఏర్పాట్లు
-వివిధ రంగాల్లో డ్రోన్ల సాంకేతిక వినియోగంపై 9 సెషన్లు -4 కీలక ప్రజెంటేషన్లు,అమరావతిని దేశంలో భవిష్యత్తు డ్రోన్ సిటీగా రూపొందించే అంశంపై ప్రత్యేక ఇంటరాక్టివ్ సెషన్ -దేశ నలుమూలల నుండి డ్రోన్ తయారీదారులతో 40 ఎగ్జిబిషన్లు -సదస్సులో డ్రోన్ల వినియోగ విధానం,ఉపయోగాలపై డిమానిస్ట్రేషన్ -22న విజయవాడ కృష్ణానది బెర్ము పార్కు వద్ద 5వేల డ్రోన్లతో డ్రోన్ షో,లేజర్ షో, సాంస్కృతిక కార్యక్రమాలు -ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఈనెల 22,23 తేదీల్లో మంగళగిరి సికె …
Read More »వరద బాధితుల సహాయార్థం రూ. 50 వేలు విరాళం అందించిన బత్తలపల్లి వాసి ఎం. వెంకట కృష్ణ
-మంత్రి సత్య కుమార్ కి అందజేత. -ఎం. వెంకట కృష్ణ ను అభినందించిన ఆరోగ్యశాఖ మంత్రి. ధర్మవరం, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ ప్రాంతంలో వరదల కారణంగా నష్టపోయిన ప్రజలను ఆదుకోవడానికి బత్తలపల్లికి చెందిన విజ్ఞాన భారతి విద్యాలయ కరస్పాండెంట్ ఎం. వెంకట కృష్ణ ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ. 50 వేలు విరాళం అందించారు. దీనికి సంబంధించిన చెక్కును శుక్రవారం విజయవాడలోని సెక్రటేరియట్ లో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ పేషీలో మంత్రి కి అందజేశారు. వరదల …
Read More »కేంద్ర మంత్రి డాక్టర్ ఎల్.మురుగన్ కు ఘన స్వాగతం
పుట్టపర్తి, నేటి పత్రిక ప్రజావార్త : సత్యసాయి మహా సమాధి దర్శనం కోసం కేంద్ర సమాచార, పార్లమెంటరీ వ్యవహారాలశాఖ మంత్రి డాక్టర్ ఎల్.మురుగన్ శుక్రవారం శాంతిభవనకు విచ్చేశారు. శాంతిభవన్ అతిథి గృహమునందు జిల్లా జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్ కేంద్ర మంత్రివర్యులకు స్వాగతం పలికారు, బెంగళూరు నుంచి ఆయన రోడ్డుమార్గంలో ప్రత్యేక కాన్వాయ్ లో శుక్రవారం సాయంత్రం 5.15 నిమిషాలకు పుట్టపర్తి శాంతిభవన్ అతిథి గృహమునందు చేరుకున్నారు. ఆయనకు అధికారులు అనధికారులు స్వాగతం పలికారు ప్రస్తుతం సత్యసాయి మహా సమాధి దర్శనం చేసుకుంటున్నారు. కార్యక్రమంలో …
Read More »6 రోజులలోనే 100 బజాజ్ సీఎన్జీ బైక్‌ల రికార్డు అమ్మకాలు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రపంచంలోనే మొట్ట మొదటి సీఎన్జీ (కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్) మోటార్ సైకిల్‌ను లాంఛ్ చేసింది బజాజ్. ఫ్రీడమ్ 125 పేరుతో విడుదల చేసింది. ఇప్పటివరకు మార్కెట్లో సీఎన్జీ కార్లు మాత్రమే ఉన్నాయి. కానీ సీఎన్జీ బైక్‌ను విడుదల చేసిన తొలి కంపెనీగా బజాజ్ అరుదైన ఘనత సాధించింది. ప్రపంచంలో మరే ఇతర కంపెనీ సీఎన్డీ బైక్‌ను ఇంకా రూపొందించలేదు. అటువంటి బజాజ్ కంపెనీ నూతనంగా విడుదల చేసిన ప్రపంచపు మొట్టమొదటి సీఎన్జీ ఫ్రీడమ్ వాహనాన్ని వరుణ్ మోటార్స్ …
Read More »సబ్సిడీ సరుకులను అందించేందుకు సహకరించండి
-వంట నూనె దిగుమతిదారుల సమావేశంలో పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ప్రజలకు భారీ ఊరట కల్పించింది. పెరిగిన ధరల నుంచి ప్రజలను కాపాడేందుకు తక్కువ ధరకే వంట నూనెను అందించాలని నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా పామాయిల్ లీటరు 110/- రూ.. సన్‌ప్లవర్ ఆయిల్ 124/- రూ.. ప్రజలకు అందుబాటులో ఉంచడం జరిగింది అన్నారు. సివిల్ సప్లయ్స్ భవనంలో శుక్రవారం వంటనూనె దిగుమతిదారులతో …
Read More »ఇసుక వ్యవహారంలో రాష్ట్ర ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం
-స్థానిక అవసరాలకు ట్రాక్టర్ లలోనూ ఉచిత ఇసుక తరలింపుకు అనుమతి -సీఎం ఆదేశాలతో ఉత్తర్వులు జారీ చేసిన గనుల శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా -ఇప్పటి వరకు ఎడ్ల బండికి మాత్రమే అనుమతి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఏపీ ప్రభుత్వం ఇసుక విషయంలో గుడ్‌న్యూస్ చెప్పింది.ఇసుక రీచ్‌ల నుంచి ఇసుకను ట్రాక్టర్లల్లో తీసుకెళ్లేందుకు అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో స్థానిక అవసరాలకు ఇసుకను తీసుకెళ్లేందుకు కేవలం ఎడ్ల బండ్లకు మాత్రమే ప్రభుత్వం అవకాశం ఇచ్చింది. సీఎం …
Read More »ప్రశాంతంగా ముగిసిన పద్నాలుగవ రోజు ఉపాధ్యాయ అర్హత పరీక్షలు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఉపాధ్యాయ అర్హత పరీక్షలలో భాగంగా పద్నాలుగవ రోజు అనగా 18/10/2024 తేదీన ఉదయం, పేపర్-2ఏ మాథ్స్ & సైన్స్ విభాగంలో మధ్యాహ్నం సాంఘిక శాస్త్ర విభాగంలో అభ్యర్థులకు ఉపాధ్యాయ అర్హత పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షలలో మొత్తం 21534 మందికి గాను 18441 మంది అభ్యర్థులు అనగా 85.63 శాతం మంది హాజరయ్యారు. ఉదయం 30 సెంటర్లలో జరిగిన పేపర్-2ఏ.మాథ్స్ & సైన్స్ ఉపాధ్యాయుల అర్హత పరీక్షకు 6610 మందికి గాను 5702 మంది అనగా 86.26 …
Read More »కుక్క, పాము కాటులకు గురైన వారికి సత్వర చికిత్స
-పోస్టర్లు, కరపత్రాల్ని ఆవిష్కరించిన వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్ సియస్ ఎం.టి.కృష్ణబాబు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కుక్క, పాము కాటులకు గురైన వారికి సత్వర చికిత్స అందించే చర్యల్లో భాగంగా సమాచారాన్ని అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా హెల్ఫ్ లైన్ ను ఏర్పాటు చేసింది. జాతీయ స్థాయిలో ఏర్పాటు చేసిన 15400 టోల్ ఫ్రీ నంబరుకు బాధితులు సంప్రదిస్తే కుక్క కాటుకు వ్యాక్సిన్లు ఎక్కడ లభ్యమవుతాయో వెంటనే సమాధానం చెప్తారు. ఉదయం 9 నుంచి సాయంత్రం ఆరు గంటల మధ్య ఈ …
Read More »రాయలసీమలో మహిళలకు ప్రత్యేక ఇంజనీరింగ్ కళాశాల
-విద్యా మంత్రి లోకేష్ కు మంత్రి సత్యకుమార్ యాదవ్ వినతి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆధునిక విజ్ఞాన, ఆర్థిక వ్యవస్థలో మహిళా సాధికారికతపై గట్టి సందేశం పంపే విధంగా రాయలసీమలో మహిళలకు ప్రత్యేకంగా ఇంజనీరింగ్ కళాశాలను ఏర్పాటు చేసే విషయాన్ని పరిశీలించాలని రాష్ట్ర మానవవనరుల అభివృద్ధి శాఖా మంత్రి శ్రీ నారా లోకేష్ కు వైద్య ఆరోగ్య శాఖా మంత్రి సత్యకుమార్ యాదవ్ విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేత్రుత్వంలో సమైక్య, విభజిత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలుగు వారి …
Read More »