Breaking News

ప్రశాంతంగా ముగిసిన పద్నాలుగవ రోజు ఉపాధ్యాయ అర్హత పరీక్షలు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఉపాధ్యాయ అర్హత పరీక్షలలో భాగంగా పద్నాలుగవ రోజు అనగా 18/10/2024 తేదీన ఉదయం, పేపర్-2ఏ మాథ్స్ & సైన్స్ విభాగంలో మధ్యాహ్నం సాంఘిక శాస్త్ర విభాగంలో అభ్యర్థులకు ఉపాధ్యాయ అర్హత పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షలలో మొత్తం 21534 మందికి గాను 18441 మంది అభ్యర్థులు అనగా 85.63 శాతం మంది హాజరయ్యారు. ఉదయం 30 సెంటర్లలో జరిగిన పేపర్-2ఏ.మాథ్స్ & సైన్స్ ఉపాధ్యాయుల అర్హత పరీక్షకు 6610 మందికి గాను 5702 మంది అనగా 86.26 శాతం మంది హాజరయ్యారు. అదేవిధంగా మధ్యాహ్నం 63 సెంటర్లలో పేపర్-2ఏ సాంఘిక శాస్త్ర అభ్యర్థుల ఉపాధ్యాయ అర్హత పరీక్షలకు 14924 మందికి గాను 12739 మంది అనగా 85.36 శాతం మంది హాజరయ్యారు. పద్నాలుగవరోజు జరిగిన ఉపాధ్యాయ అర్హత పరీక్షలు ప్రశాంతంగా ముగిసాయి. మాథ్స్ & సైన్స్ ఉపాధ్యాయ అర్హత పరీక్షల రెస్పాన్స్ షీట్లు మరియు ప్రాధమిక కీ 19-10-2024 నుండి వెబ్సైటులో అందుబాటులో ఉంటాయి . ప్రాధమిక కీ పై అభ్యర్థుల నుండి అభ్యంతరాలను 21-10-2024 వరకు టెట్ వెబ్సైటు (https://aptet.apcfss.in/ ) ద్వారా మాత్రమే స్వీకరిస్తారని ఏపీ టెట్ కన్వీనర్ శ్రీ ఎం.వి. కృష్ణారెడ్డి గారు ఒక ప్రకటనలో తెలియజేసారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *