-రాయచోటి నియోజకవర్గంలో మైనార్టీ సోదరుల అభ్యున్నతిపై చర్చ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
మైనారిటీల సామాజిక ఆర్థికాభివృద్ధి, విద్యాపరమైన పురోగతి ద్వారా వారి సంక్షేమం వేగవంతం చెయ్యడం కోసం రాయచోటి నియోజకవర్గం లో మైనార్టీ పరంగా ఉన్న పలు సమస్యలను విజయవాడలోని మైనార్టీ శాఖ మంత్రి ఫరూఖ్ గారితో రాష్ట్ర రవాణా యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సమావేశమై ఆయన దృష్టికి పలు సమస్యలను తెలిపారు. రాయచోటి నియోజకవర్గంలో షాది ఖానా ఏర్పాటు చేయాలని , మైనారిటీ వర్గాలకు చెందిన విద్యార్థుల కోసం విద్యాపరమైన రాయితీలను, మైనారిటీ వర్గాలకు చెందిన మహిళలు మరియు పిల్లల అభివృద్ధి కోసం, శిక్షణ, ఉపాధి అవకాశాలను అందించే దిశగా కార్యచరణ చేయాలని, మైనారిటీల్లో ఆర్థిక వెనుకబాటు తనం సమస్యను పరిష్కరించి, పారిశ్రామిక వ్యాపారాలను ఏర్పాటు చేయాలని మైనారిటీ శాఖ మంత్రిని, రవాణా శాఖ మంత్రి కోరారు.
Prajavartha Online Telugu News