Breaking News

Daily Archives: December 28, 2024

ఉద్యోగ మేళాకు అనూహ్య స్పందన.

-4,800 మంది అభ్యర్థులు హాజరుకాగా 1,095 మందికి ఉద్యోగ అవకాశం. -ప్రతి నియోజకవర్గం లో జాబ్ మేళాలు నిర్వహిస్తాం. -జిల్లా కలెక్టర్ డా.జి. లక్ష్మీశ. విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగరంలో నిర్వహించిన వికసిత్ భారత్ మెగా జాబ్ మేళాకు అనూహ్య స్పందన లభించిందని 4,800 మందికి పైగా నిరుద్యోగులు హాజరుకాగా వివిధ కంపెనీలు నిర్వహించిన మౌఖిక పరీక్షలో 1,095 మంది ఉద్యోగ అవకాశాలను పొందటం అభినందనీయమని జిల్లా కలెక్టర్ లక్ష్మీశ తెలిపారు. వికసిత్ భారత్ మెగా జాబ్ మేళా కార్యక్రమంలో భాగంగా …

Read More »

మత్స్యకారులకు జీవనోపాధి కల్పించేందుకు నదీ తీరప్రాంతాలలో చేప పిల్లలను విడుదల

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : అంతరించిపోతున్న మత్స్య సంపదను తిరిగి పెంచటంతో పాటు మత్స్యకారులకు జీవనోపాధి కల్పించేందుకు నదీ తీరప్రాంతాలలో చేప పిల్లలను విడుదలచేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డా.జి.లక్ష్మీశ, శాసన సభ్యులు యలమంచిలి సత్యన్నారాయణ (సుజనా చౌదరి) లు తెలిపారు. జిల్లా మత్స్యశాఖ ఆధ్వర్యంలో స్థానిక భవానీపురం సమీపంలో గల భవానీ ఘాట్ వద్ద శనివారం జిల్లా కలెక్టర్ జి. లక్ష్మీశ, విజయవాడ పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు యలమంచిలి సత్యన్నారాయణ (సుజనా చౌదరి) కృష్ణనదిలో చేప పిల్లలను విడుదల చేసారు. ఈ …

Read More »

ప్రజాదరణ పొందుతున్న సంజా ఉత్సవ్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో డిసెంబర్ 26, 2024 నుండి మారిష్టల ఇండోర్ స్టేడియంలో జరుగుతున్న సంజా ఉత్సవ ఎస్ హెచ్ జి మేళలో ప్రజలు చురుగ్గా పాల్గొంటున్నారని పిఒయుసిడి వెంకటనారాయణ అన్నారు. శనివారం ఉదయం సంజా ఉత్సవ పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజల నుండి ఆదరణ అనుకున్న దాని కంటే ఎక్కువ వస్తుందని స్వయం సహాయక సంఘాలు ఏర్పాటు చేసిన బందుకు పైగాస్టార్లలో ప్రదర్శన మరియు అమ్మకాలు గణనీయంగా జరుగుతున్నాయని తెలిపారు. మరోవైపు అన్న …

Read More »

ఉద్యోగ అవకాశాల ద్వారా యువతకు బంగారు భవిష్యత్తు.

– ప్రతి నిరుద్యోగికి ఉద్యోగ అవకాశం కల్పించాలన్నదే లక్ష్యం. – జాబ్ మేళా ద్వారా జిల్లాలో లక్ష మంది యువతకు ఉద్యోగ అవకాశాలు. – ఎంపీ కేశినేని శివనాధ్, జిల్లా కలెక్టర్ డా.జి. లక్ష్మీశ. విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జాబ్ మేళా ద్వారా నిరుద్యోగ యువతకు కల్పిస్తున్న అవకాశాలను అందిపుచ్చుకొని ఉద్యోగం పొందడంతో పాటు మరొకరికి ఉద్యోగ అవకాశం కల్పించే స్థాయికి యువత ఎదగాలని ప్రముఖ కంపెనీల సహకారంతో జాబ్ మేళాను నిర్వహించి జిల్లాలో లక్ష మంది నిరోద్యోగ యువతకు ఉద్యోగ …

Read More »

అభివృద్ధి సంక్షేమమే లక్ష్యం ఎమ్మెల్యే సుజనా చౌదరి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని పశ్చిమ శాసనసభ్యులు యలమంచిలి సత్యనారాయణ (సుజన చౌదరి) తెలిపారు. పశ్చిమ నియోజకవర్గం లోని పలు అభివృద్ధి పనులకు శనివారం శంకుస్థాపన చేశారు. 48వ డివిజన్ ఆళ్ల నాగయ్య వీధిలో రూ 31 లక్షల 95 వేలతో నిర్మించనున్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి శంకుస్థాపన చేశారు.49 వ డివిజన్ పరిధిలో వీరయ్య వీధి కొండ ప్రాంతం లో రూ 37 లక్షల 57 వేలతో రిటైనింగ్ వాల్ పనులు, …

Read More »

సముద్రపు నాచు పెంపకంతో సంపద సృష్టి — మత్స్య శాఖ కమిషనర్

పల్లెపాలెం, నేటి పత్రిక ప్రజావార్త : సముద్రపు నాచు పెంపకంతో సంపద సృష్టించడానికి ప్రభుత్వం అడుగులు ముందుకు వేస్తోందని మత్స్య శాఖ కమిషనర్ డోలా శంకర్ పేర్కొన్నారు. మచిలీపట్నం మండలం పల్లెపాలెం గ్రామ పరిధిలో మత్స్య శాఖ ఆధ్వర్యంలో పైలెట్ ప్రాజెక్టు కింద ఏర్పాటు చేసిన పంజరంలో సముద్రపు నాచు పెంపక ప్రదర్శన క్షేత్రమును శనివారం మధ్యాహ్నం మత్స్య శాఖ కమిషనర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకం కింద సముద్రపు నాచు మొక్కల పెంపకాన్ని గతంలో …

Read More »

ఎస్సీ ఉప కులాల వారిగా సామాజిక, రాజకీయ, ఆర్ధిక స్థితిగతులపై ఖచ్చితమైన గణాంకాలతో

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఎస్సీ ఉప కులాల వారిగా సామాజిక, రాజకీయ, ఆర్ధిక స్థితిగతులపై ఖచ్చితమైన గణాంకాలతో సమగ్ర వివరాలను అందించాలని ఎస్సి ఉపకులాల వర్గీకరణపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఏకసభ్య కమీషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా ఉమ్మడి కృష్ణ జిల్లా అధికారులను కోరారు. ఏకసభ్య కమిషన్ ఉమ్మడి కృష్ణజిల్లా పర్యటలో భాగంగా కృష్ణజిల్లా మచిలీపట్నంలో జిల్లా పరిషత్ సమావేశ హాలులో ఉమ్మడి జిల్లాలో భాగమైన కృష్ణ, ఎన్టీఆర్, ఏలూరు జిల్లాల ఎస్సీలలోని ఉపకులాల వారిగా జనాభా, వారి …

Read More »

షెడ్యూల్ కులాల లోని ఉప కులాల ప్రజల నుంచి అభ్యంతరాలు, వినతులను స్వీకరించిన ఎస్సీ వర్గీకరణ ఏక సభ్య కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా..

మచిలీపట్నం , నేటి పత్రిక ప్రజావార్త : షెడ్యూల్ కులాల ఉప వర్గీకరణపై రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ఏక సభ్య కమిషన్ శనివారం కృష్ణా జిల్లాలో పర్యటించింది. జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ కన్వెన్షన్ హాల్ సమావేశ మందిరంలో ఎస్సీ ఉప కులాల వర్గీకరణకు సంబంధించిన అంశంపై ఆయా కులాల ప్రతినిధులు, ప్రజలు, ఉద్యోగ సంఘాలు, కుల సంఘాల నాయకుల నుంచి ఏక సభ్య కమీషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా వినతులు, అభిప్రాయాలు, సూచనలను జిల్లా కలెక్టర్ డీ.కే. …

Read More »

ఉపాధ్యాయులను ఒత్తిళ్లకు గురిచేయడం కూటమి సర్కారు మానుకోవాలి

– వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఉపాధ్యాయులను ఇబ్బంది పెట్టడం, ఒత్తిళ్లకు గురిచేసే విధానాలను కూటమి ప్రభుత్వం మానుకోవాలని వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు సూచించారు. పెదపరిమి లీడర్ షిప్ ట్రైనింగ్ క్యాంపులో నూజెండ్ల మండల ఉపాధ్యాయుడు యు.పోతురాజు స్పృహ కోల్పోయిన ఘటన బాధాకరమన్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. ఉపాధ్యాయులపై కూటమి ప్రభుత్వం చేస్తున్న తీవ్రమైన మానసిక ఒత్తిడి మూలంగానే ఈ సంఘటన జరిగిందని …

Read More »