Daily Archives: July 13, 2026

జిల్లాలో యువజన అభివృద్ధి దిశగా అడుగులు

– జిల్లా యువజన కార్యక్రమాల సమన్వయ కమిటీ సమావేశంలో వార్షిక కార్యాచరణ ప్రణాళికకు ఆమోదం – “మై భారత్” నమోదులు, యూత్ హాస్టల్ పునర్నిర్మాణంపై దృష్టి – జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్టీఆర్ జిల్లాలో యువత సాధికారత, నాయకత్వ వికాసం, నైపుణ్యాభివృద్ధి, స్వచ్ఛంద సేవా కార్యక్రమాల విస్తరణకు మరింత వేగం చేకూర్చే దిశగా జిల్లా యువజన కార్యక్రమాల సమన్వయ కమిటీ కీలక నిర్ణయాలు తీసుకుంది. కేంద్ర ప్రభుత్వ “మై భారత్” కార్యక్రమాన్ని జిల్లాలో విస్తృతంగా అమలు …

Read More »

ఎరువులు అక్రమ రవాణా, కొరత, వదంతులు సృష్టించినా కఠిన చర్యలు

– జిల్లాలో స‌మృద్ధిగా యూరియా, ఇత‌ర ఎరువులు – రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు – ఏపీఏఐఎంఎస్ యాప్ ద్వారా పారదర్శకంగా ఎరువుల పంపిణీ – అవసరానికి మించి ఎరువుల వినియోగం వద్దు.. – అంతర పంటలు, పంట మార్పిడి విధానాలను రైతులు అవలంబించాలి – జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్టీఆర్ జిల్లాలో యూరియా సహా అన్ని రకాల రసాయన ఎరువులు, పురుగుమందులు సమృద్ధిగా అందుబాటులో ఉన్నాయని, రైతులు ఎలాంటి ఆందోళనకు గురికావాల్సిన అవసరం …

Read More »

సి.ఆర్.మీడియా అకాడమీ అక్కౌంట్స్ అధికారి గా పి. కరుణామయి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సి.ఆర్.మీడియా అకాడమీ అక్కౌంట్స్ అధికారి గా పి. కరుణామయి సోమవారం పదవీ బాధ్యతులు స్వీకరించారు. ట్రెజరీస్ అండ్ అక్కౌంట్స్ శాఖ కు చెందిన పి. కరుణామయి ఇటీవలే అక్కౌంట్స్ అధికారిగా పదోన్నతి పొందారు. అనంతరం ఆమెను సి.ఆర్. మీడియా అకాడమి కార్యాలయంలో అకౌంట్స్ అధికారిగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తరువులను పురస్కరించుకుని స్థానిక మొఘల్ రాజ్ పురంలోని సి.ఆర్. మీడియా అకాడమి కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. అంతకు ముందు అకాడమీ చైర్మన్ ఆలపాటి …

Read More »

ఇదే ఆఖ‌రి రోజు స‌ర్‌..

– ఎన్యూమ‌రేష‌న్ ఫారాన్ని వెంట‌నే బీఎల్‌వోకు అంద‌జేయండి – ఓటు హక్కు ప్రతి పౌరుని రాజ్యాంగబద్ధమైన హక్కు – ఆ హ‌క్కును భద్రపరచుకోవడం ప్రతిఒక్కరి బాధ్యత – క్షేత్ర‌స్థాయిలో ఓట‌ర్ల సేవ‌లో ప్ర‌త్యేక అధికారులు – 16,35,148 (95.43 శాతం) మంది ఓట‌ర్ల వివ‌రాల డిజిటైజేష‌న్ – మీడియా స‌మావేశంలో జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌) కార్య‌క్ర‌మంలో ఎన్యూమ‌రేష‌న్ ఫారాల స‌మ‌ర్ప‌ణ‌కు నేడు (జూలై 14) ఆఖ‌రి రోజు …

Read More »

ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టేలా అర్జీల పరిష్కారం

– స‌మ‌స్య‌ల పరిష్కారంలో బాధ్యతాయుతంగా వ్యవహరించాలి – జిల్లాస్థాయి ప్ర‌జా స్నేహ‌పూర్వ‌క పీజీఆర్ఎస్‌కు 237 అర్జీలు – జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్ర‌జా స్నేహ‌పూర్వ‌క ప్ర‌జా స‌మ‌స్య‌ల ప‌రిష్కార వేదిక (పీజీఆర్ఎస్‌) ద్వారా అందుతున్న అర్జీలను సకాలంలో నాణ్యతతో పరిష్కరించి ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టాలని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ శ్రీ పింగ‌ళి వెంక‌య్య స‌మావేశ మందిరంలో నిర్వ‌హించిన పీజీఆర్ఎస్ కార్య‌క్ర‌మంలో క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌.. జాయింట్ క‌లెక్ట‌ర్ ఎస్‌.ఇల‌క్కియ‌, …

Read More »

చేనేత కార్మికుల ఆరోగ్య పరిరక్షణకు ప్రత్యేక వైద్య శిబిరాలు

-పెడనలో ఉచిత వైద్య శిబిరాలను ప్రారంభించిన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ పెడన, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హస్తకళల మహోత్సవం సందర్భంగా.. చేనేత కార్మికులు ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యలను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుంది. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు, కృష్ణా జిల్లా కలెక్టర్ చొరవతో పెడన నియోజకవర్గంలోని పెడన పట్టణంలో సోమవారం వారికి ఉచిత వైద్య శిబిరాలను నిర్వహించారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ సహకారంతో, చేనేత జౌళి శాఖ …

Read More »

వినతుల పరిష్కారంలో నిర్లక్ష్యానికి తావులేదు.. జిల్లా కలెక్టర్ డీకే బాలాజి

-ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీకోసం కార్యక్రమం నిర్వహించి అర్జీలు స్వీకరించిన జిల్లా కలెక్టర్ మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజా సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యానికి తావులేకుండా, ప్రతి వినతిని నిర్ణీత గడువులో పరిష్కరించేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజి అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా కలెక్టర్ కలెక్టరేట్లోని పిజిఆర్ఎస్ సమావేశపు మందిరంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీకోసం కార్యక్రమం నిర్వహించి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. కార్యక్రమంలో ఆయన జాయింట్ కలెక్టర్ ఎం నవీన్, ఇంచార్జి …

Read More »

ప్రజల సమస్యలపై శాఖాధిపతులు ప్రత్యేక దృష్టి పెట్టాలి

-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజల నుండి వచ్చే ప్రతి ఫిర్యాదును బాధ్యతగా స్వీకరించి, క్షేత్రస్థాయిలో పరిశీలించి శాశ్వత పరిష్కారం అందించాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అధికారులను ఆదేశించారు. సోమవారం ఉదయం ప్రధాన కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ రూమ్‌లో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో కమిషనర్ పాల్గొని ప్రజల వినతులను స్వీకరించారు. ప్రధాన కార్యాలయంతో పాటు జోనల్ కార్యాలయాల్లో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల కార్యక్రమాలను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించిన కమిషనర్, …

Read More »

నగర పరిశుభ్రతకు పారిశుద్ధ్య కార్మికుల సేవలు అమూల్యం

-విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగర పరిశుభ్రతకు పారిశుద్ధ్య కార్మికుల సేవలు అమూల్యం అని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. సోమవారం ఉదయం తన పర్యటనలో భాగంగా మహాత్మా గాంధీ రోడ్, బెంజ్ సర్కిల్, స్క్యూ బ్రిడ్జి, రాణిగారితోట, కృష్ణలంక ప్రాంతాల్లో పర్యటించి క్షేత్రస్థాయిలో పారిశుద్ధ్య నిర్వహణను పరిశీలించారు. ఈ సందర్భంగా విధులు నిర్వహిస్తున్న పారిశుద్ధ్య కార్మికులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ …

Read More »