Daily Archives: July 13, 2026

విశాఖపట్నంలో రేపు ఏపీఎస్ఆర్టీసీ జేఏసీ రాష్ట్రస్థాయి సమావేశం

-ఉద్యమ కార్యాచరణపై కీలక నిర్ణయాలు – సమావేశం అనంతరం 4 గంఃలకు మీడియా సమావేశం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ​ ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగుల సమస్యల పరిష్కారం, ఆర్టీసీ పరిరక్షణ, ప్రభుత్వానికి సమగ్రంగా ఉద్యోగుల డిమాండ్లను తెలియజేసే తదుపరి ఉద్యమ కార్యాచరణపై చర్చించేందుకు మంగళవారం మధ్యాహ్నం విశాఖపట్నంలోని మద్దిలపాలెంలో ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగ సంఘాల జేఏసీ రాష్ట్రస్థాయి నేషనల్ మజ్దూర్ యూనియన్ కార్యాలయంలో సమావేశం నిర్వహించబడుతుంది. ఈ సమావేశంలో రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయనున్న ఉద్యమ కార్యాచరణ, ఈనెల 14 నుండి ప్రజాప్రతినిధులను కలిసే కార్యక్రమాలుపైన,ఉద్యోగుల …

Read More »

సాక్ష్యాలను తారుమారు చేసి.. నిజాలను కప్పిపుచ్చడంలో గొడ్డలి పార్టీకి మించిన వారు లేరు

– నిందితులను కాపాడేందుకు అమాయక యువకుడిని బలిపశువుని చేశారు – శ్రీకాకుళం ప్రమాద ఘటనలో నిజాలను వక్రీకరించే ప్రయత్నం జరిగింది – అప్పలరాజుపైనా కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలి – ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ బుచ్చి రాంప్రసాద్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ​ శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో జరిగిన రోడ్డు ప్రమాద ఘటనలో నిజాలను కప్పిపుచ్చేందుకు, సాక్ష్యాలను తారుమారు చేసేందుకు ప్రయత్నం జరిగిందని ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ బుచ్చి రాంప్రసాద్ ఆరోపించారు. సోమవారం తెలుగుదేశం పార్టీ కేంద్ర …

Read More »

గార్బేజ్ ట్రాన్స్‌ఫర్ స్టేషన్‌కు అనువైన స్థలం గుర్తించండి

-ఆటోనగర్‌లో పేరుకుపోయిన చెత్తని 10 రోజుల్లో తొలగించండి -అధికారులకు స్వచ్ఛ ఆంధ్ర కార్పోరేషన్ చైర్మన్ పట్టాభిరామ్ ఆదేశాలు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ​ ఐఏఎల్ఏ (ఇండస్ట్రియల్ ఏరియా లోకల్ అథారిటీ) పరిధి ఆటో నగర్ ప్రాంతంలో ‘చెత్త సేకరణ, బదిలీ కేంద్రం’ (గార్బేజ్ ట్రాన్స్‌ఫర్ స్టేషన్‌) ఏర్పాటుకు అనువైన ఖాళీ స్థలాన్ని గుర్తించాలని ఏపీఐఐసీ, ఐఏఎల్ఏ అధికారులను స్వచ్ఛ ఆంధ్ర కార్పోరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ఆదేశించారు. ఈ కేంద్రం ఏర్పాటుకు అవసరమైన సమగ్ర లేఅవుట్ ప్లాన్, ఇంజనీరింగ్ డిజైన్, అంచనా …

Read More »

అమరావతి ఛాంపియన్‌ షిప్ 2.0కు శ్రీకారం

-అమరావతి ఛాంపియన్షిప్ పోస్టర్ ఆవిష్కరణ -పాఠశాల నుంచి యూనివర్సిటీ స్థాయి విద్యార్థులకు ఇది గొప్ప అవకాశం -12 క్రీడాంశాల్లో అండర్ – 17 & అండర్ – 23 విభాగాలలో నియోజకవర్గం స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పోటీలు -ఆగష్టు 29 న నేషనల్ స్పోర్ట్స్ డే రోజు రూ. 94 లక్షలను నగదు రూపంలో విజేతలకు బహుమతులు అందచేస్తాం -మట్టిలో మాణిక్యాలను వెలికి తీయడమే ప్రధాన లక్ష్యం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ​ అమరావతి ఛాంపియన్‌షిప్ 2.0 పోస్టర్‌ను …

Read More »

అదనపు కమీషనర్ గా చేరిన ఐ. కిషోర్ ను కలిసిన ప్రభుత్వ ఉద్యోగుల సర్వీస్ అసోసియేషన్ సభ్యులు

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ​ గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ కు అదనపు కమీషనర్ గా నూతనంగా విధుల్లో చేరిన ఐ. కిషోర్ ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సర్వీస్ అసోసియేషన్ సభ్యులు సోమవారం ఆయన ఛాంబర్ లో కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలు వారీ దృష్టికి తీసుకొని వెళ్ళగా, స్పందించిన అదనపు కమిషనర్ తన పరిధిలో లో ఉన్న ప్రతి ఒక్క ఉద్యోగి సమ‌స్యను పరిష్కరించుటకు కృషి చేయుట జరుగుతుందని ఉద్యోగ సంఘ నాయకులకు హామి …

Read More »

ప్రముఖ ప్రాంతాలలో ప్రత్యేక హెల్ప్ డెస్క్‌ల ఏర్పాటు…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ​ గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో జరుగుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (సర్) ప్రక్రియకు నేటితో (మంగళవారం) గడువు ముగుస్తుందని, ప్రజల సౌకర్యార్థం అన్ని సచివాలయాలు, నగరంలోని ప్రధాన కూడళ్లు, ప్రముఖ ప్రాంతాలలో ప్రత్యేక హెల్ప్ డెస్క్‌లను ఏర్పాటు చేశామని నగర కమిషనర్, తూర్పు నియోజకవర్గ ఈఆర్ఓ కె.మయూర్ అశోక్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఎన్యూమరేషన్ ఫారాలు అందుకున్న ఓటర్లు వాటిని నింపి, వెంటనే బిఎల్ఓలకు ఇచ్చి సహకరించాలని …

Read More »

ఎన్యూమరేషన్ ఫారాలను అత్యధిక ప్రాధాన్యతతో డిజిటైజ్డ్ చేయాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ​ ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) ఎన్యూమరేషన్ ఫారాలను అత్యధిక ప్రాధాన్యతతో డిజిటైజ్డ్ చేయాలని, సూపర్వైజరీ అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని గుంటూరు తూర్పు నియోజకవర్గ ఈఆర్ఓ, నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ ఆదేశించారు. సోమవారం నగరంపాలెం, ఆర్.అగ్రహారం, ఎన్ఎస్పీ కెనాల్ క్వార్టర్స్ లోని వార్డ్ సచివాలయాల్లో బిఎల్ఓలు చేస్తున్న ఎన్యూమరేషన్ ఫారాల డిజిటైజ్డ్ ప్రక్రియను పరిశీలించి, వేగవంతంపై తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. ఓటరు జాబితా ప్రత్యేక …

Read More »

ప్రజల నుండి అందే అర్జీలను నిర్దేశిత గడువులోగా పరిష్కరించాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ​ ప్రజల నుండి అందే అర్జీలను నిర్దేశిత గడువులోగా పరిష్కరించాలని గుంటూరు నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ ఐ.కిషోర్ విభాగాదిపతులకు తెలిపారు. సోమవారం నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ ఆదేశాల మేరకు జిఎంసి కౌన్సిల్ సమావేశ మందిరంలో నిర్వహించిన ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ కార్యక్రమంలో అదనపు కమిషనర్ ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా అదనపు కమిషనర్ మాట్లాడుతూ, పిజిఆర్ఎస్ కు అందే ఫిర్యాదుల్లో ఎక్కువగా పారిశుధ్యం, డ్రైనేజీ సమస్యలు, త్రాగునీటి సరఫరా మరియు …

Read More »

పాత్రికేయులపై దాడి అత్యంత దుర్మార్గం..

-నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని తిరుపతి ఎంపీ గురుమూర్తి డిమాండ్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ​ విధులు నిర్వహిస్తున్న పాత్రికేయులపై టీడీపీ నేతలు గూండాల మాదిరిగా దాడికి పాల్పడటం అత్యంత దుర్మార్గమైన చర్య అని తిరుపతి పార్లమెంట్ సభ్యులు డాక్టర్ మద్దిల గురుమూర్తి తీవ్రంగా ఖండించారు. తిరుపతిలోని ఓ ప్రముఖ హోటల్‌లో నిర్వహించిన కార్యక్రమం కవరేజీకి వెళ్లిన జర్నలిస్టులపై, ఇద్దరు కూటమి ప్రభుత్వ మంత్రుల సమక్షంలోనే దాడి జరిగిందనే వార్తలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి …

Read More »

విజయవాడ ప్రభుత్వ ఐ.టి.ఐ కళాశాలలో జనరల్ పూల్ కౌన్సిలింగ్…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ​విజయవాడలోని ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణా సంస్థ (ITI) నందు వివిధ ట్రేడులలో మిగిలివున్న సీట్ల భర్తీ కొరకు ఈ నెల 15వ తేదీన “జనరల్ పూల్ కౌన్సిలింగ్” నిర్వహించనున్నట్లు ఎన్టీఆర్ జిల్లా ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ సంస్థ ప్రిన్సిపాల్, కన్వీనర్ ఎం. కనక రావు ఒక ప్రకటనలో తెలిపారు. ఐ.టి.ఐ కోర్సుల్లో చేరడానికి దరఖాస్తు చేసుకుని, ఇంతవరకు సీటు రాని వారు, గత కౌన్సిలింగ్‌కు హాజరుకాని అభ్యర్థులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చని ఆయన పేర్కొన్నారు. ​అర్హులైన అభ్యర్థులు …

Read More »