రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ఏపీ సచివాలయంలో ఇరవై సూత్రాల కార్యక్రమాల అమలు చైర్మన్ లంకా దినకర్ కార్యాలయంలో లో “ ప్రకృతి సేద్యంలో ప్రతిబంధకాలను అధిగమించి రైతుకు లాభదాయకత పెంచడానికి చేపట్టాల్సిన చర్యలు “ పైన జరిగిన సమావేశంలో
ఆర్గానిక్ ప్రొడక్ట్ సర్టిఫికేషన్ అథారిటీ చైర్మన్ దేవదత్తు, అత్తలూరి పాలెం ఆర్గానిక్ ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ ఎండీ సురేంద్ర బాబు పాల్గొన్నారు. కేంద్ర ప్రాయోజిత కార్యక్రమాల పైన వివిధ జిల్లాలో జరిపిన సమీక్షల అనంతరం ప్రకృతి సేద్యం పైన ఉన్న అపోహల నివృత్తి కోసం చేపట్టాల్సిన చర్యల పైన సమావేశం జరిగింది. వివిధ శాఖల మధ్య సమన్వయంతో ప్రకృతి సేద్యం తో ప్రజలకు ఆరోగ్యం, రైతులకు లాభదాయకత. దేశంలో ఆర్గానిక్ ఫార్మింగ్ వృద్ధి చెందే విధంగా ప్రధాని నరేంద్ర మోడీ గారు రైతులను లను ప్రోత్సాహకాలతో ప్రోత్సహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ను ఆర్గానిక్ ఫార్మింగ్ హబ్ గా మార్చడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కార్యాచరణ చేపట్టారు. దేశీ అవులను ప్రకృతి సేద్యంలో భాగస్వామ్యం చేయడం ద్వారా ఆరోగ్యకరమైన పాలు, పెరుగు, నెయ్యతో పాటు వ్యవసాయానికి అవసరమైన సహజ ఎరువులు ఉత్పత్తి లభ్యం అవుతుంది. ఆవు వ్యర్థాలతో తయారు అయ్యే ఘన మరియు ద్రవ జీవన అమృతం, కషాయాల వినియోగంతో ప్రకృతి సేద్యం సాగులో అత్యధిక ఉత్పాదకత సాధించవచ్చు. బ్రెజిల్ లో ఒంగోలు జాతి ఆవులను వృద్ధి చేయడం ద్వారా ఒక్కొక్క ఆవు నుండి సగటున 30 లీటర్ల పాలు ప్రతి రోజు ఉత్పత్తి జరుగుతుంది. ఒంగోలు జాతి ఆవుల సంతాన వృద్ధితో అంతరిస్తున్న మేలు జాతి దేశీయ ఆవుల పెంపకానికి ప్రోత్సాహం అవసరం. ప్రకృతి సేద్య కార్యాచరణకు అవసరమైన నైపుణ్య అభివృద్ధి కోసం కార్యాచరణ అవసరం. ప్రకృతి సేద్యంతో వచ్చే ఉత్పత్తికి అదనపు విలువ వచ్చే ప్రజా వినియోగ వస్తువుల తయారీ ప్రోత్సహంతో రైతుకు అత్యధిక మేలు జరుగుతుంది. ఇరవై సూత్రాల కార్యక్రమాలు సమీక్షలో విజయనగరం జిల్లా ఎమ్మెల్యేలు మరియు ప్రజాప్రతినిధులు కోరిన విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనుమతితో వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్న నాయుడు సహకారంతో ఆర్గానిక్ ప్రొడక్ట్ సర్టిఫికేషన్ అథారిటీ చైర్మన్ ఆద్వర్యంలో బృందాన్ని ఆ జిల్లాలో ప్రకృతి సేద్యాన్ని విజయవంతం చేయడానికి తీసుకోవాల్సిన చర్యలు పైన అధ్యయనం చేసి కార్యాచరణ ప్రణాళిక తయారు చేయడానికి ఈ సమావేశంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది.
Tags rajamandri
Check Also
ప్రధాని పర్యటనకు సర్వ సన్నద్ధం : పల్లా
విశాఖపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఏపీలో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పాటైన తరువాత తొలిసారి రాష్ట్రానికి వస్తున్న ప్రధాని నరేంద్ర …