-పలు అంశాలను కేంద్రం దృష్టి కి తీసుకెళ్లి పరిష్కారానికి సహకారం కోరిన మంత్రి రాంప్రసాద్ రెడ్డి
-ప్రమాదల నివారణ లో భాగంగా కడప – రాయచోటిలో 4 కిలోమీటర్ల టన్నెల్ ఏర్పాటుకు సర్వం సిద్ధం.
-ఇటీవల సమగ్ర నివేదిక సిద్ధం చేసిన కేంద్ర రవాణా బృందం.
-నాలుగు లైన్ల టన్నెల్ ఏర్పాటుకు అటవీ శాఖ అనుమతులు రాగానే పనులు చేపట్టేందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్.
-కడప నుండి రాయచోటి వరకు 4 లేన్ల రహదారిని మంజూరుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరిన ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ మండిపల్లి.
-రాజంపేట – రాయచోటి – కదిరి రహదారి – రాష్ట్ర రహదారి నుండి జాతీయ రహదారిగా మెరుగుపరచడానికి చర్యలు తీసుకోవాలని కోరిన ఏపీ రవాణా శాఖ మంత్రి.
-రాయచోటిలో రోడ్ల విస్తరణ గ్రామాలు, మండల కేంద్రాలు మరియు జిల్లా హెడ్ క్వార్టర్స్ మధ్య మెరుగైన కనెక్టివిటీని సులభతరం చేసేందుకు సెంట్రల్ రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నిధుల ద్వారా పనులకు అనుమతులు కోరిన మంత్రి
-NHLML (నేషనల్ హైవేస్ లాజిస్టిక్స్ మేనేజ్‌మెంట్ లిమిటెడ్). ప్రాజెక్టును ఆమోదం
న్యూ ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త :
న్యూఢిల్లీలో రాష్ట్ర రవాణా యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా కేంద్ర రవాణా మంత్రి నితిన్ గడ్కరీతో ఆయన నివాసంలో సుమారు 45 నిమిషాల పాటు సమావేశమై పలు రవాణా అంశాలపై చర్చించారు. రోడ్డు భద్రతా ప్రమాదల నివారణ లో భాగంగా కడప – రాయచోటిలో 4 కిలోమీటర్ల టన్నెల్ ఏర్పాటుకు సర్వం సిద్ధం కాగా ఇటీవల సమగ్ర నివేదిక కేంద్ర రవాణా బృందంసిద్ధం చేసిందని, నాలుగు లైన్ల టన్నెల్ ఏర్పాటుకు అటవీ శాఖ అనుమతులు రాగానే పనులు చేపట్టేందుకు కేంద్రం ఆమోదం రూపంలో సహకారం అందివ్వాలని మంత్రి రాంప్రసాద్ కోరారు.
అందులో భాగంగా రాయచోటి లో సెంట్రల్ రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్షన్ నిధుల ద్వారా రోడ్ల విస్తరణ గ్రామాల మండలాల కేంద్రాల మరియు జిల్లా హెడ్ క్వార్టర్స్ మధ్య మెరుగైన కనెక్టివిటీ సులువుతరం చేసేందుకు నిధులు మంజూరు చేయాలని, ఎన్ హెచ్ నేషనల్ హైవేస్ లాజిక్ మేనేజ్మెంట్ ప్రాజెక్టును ఆమోదించి పనులను త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టే విధంగా ఆదేశాలు జారీ చేయాలని, కడప నుండి రాయచోటి వరకు 4 లైన్ల రహదారిని మంజూరుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని, రాజంపేట – రాయచోటి – కదిరి రహదారి – రాష్ట్ర రహదారి నుండి జాతీయ రహదారిగా మెరుగుపరిచేందుకు శాఖపరమైన ఆదేశాలు జారీ చేయాలని కేంద్ర మంత్రిని రవాణా శాఖ మంత్రి కోరారు. దీనిపట్ల కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ గారు స్పందిస్తూ రాష్ట్ర రవాణా అభివృద్ధికి పూర్తిగా సహకరిస్తామని ఆయన హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో రవాణా శాఖకు సంబంధించిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు.