విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
గుణదల ప్రాంతంలో ఆధునీకరించిన రాంగోపాల్ ధియేటర్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి శనివారం ముఖ్యఅతిథిగా ఎంపికేశినేని శివనాథ్ హాజరైయ్యారు. రామ్ సినిమాస్ పేరుతో ఆధునీకరించిన రాంగోపాల్ ధియేటర్ ప్రొజెక్టర్ రూమ్‌ను ఎంపి కేశినేని శివనాథ్ ప్రారంభించారు. అనంతరం ప్రొజెక్టర్ స్విచ్చ్ ఆన్ చేశారు. ఈ సందర్భంగా ధియేటర్ యాజమాన్యానికి ఎంపికేశినేని శివనాథ్ శుభాకాంక్షలు తెలిపారు.
ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ గతంలో రాంగోపాల్ థియేటర్‌గా విజయవాడ నగరంలో ప్రసిద్ధి చెందిందన్నారు. థియేటర్లు మనుషుల మానసిక ఉల్లాసానికి ఎంతో దోహదపడుతున్నాయని తెలిపారు. రాంగోపాల్ థియేటర్‌ని ఆధునిక టెక్నాలజీతో రీ మోడలింగ్ చేసి రామ్ సినిమాస్‌గా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారని కావున ప్రేక్షకుల ఆధ్వర్యంలో రామ్ సినిమాస్ అభివృద్ధి చెందాలని కోరుకుంటూ రామ్ సినిమాస్ థియేటర్ అధినేతలకు శుభాభినందనలు తెలిపారు.
ఈ సందర్భంగా రామ్ సినిమాస్ థియేటర్ అధినేత యలమంచిలి రామచంద్రరావు మాట్లాడుతూ మా నాన్న పున్నయ్య రామ్‌గోపాల్ థియేటర్‌ని నిర్మించారని అప్పట్నుంచి ఇప్పటివరకు నాలుగు తరాలుగా అభివృద్ధి చెందుతూ ఇప్పుడు ఆధునిక టెక్నాలజీ కలిగిన పరికరాలతో రామ్ సినిమాస్‌ని పునః నిర్మాణం చేసి ప్రారంభించామన్నారు. ప్రేక్షకులకు స్క్రీన్ వన్‌లో 398 సీట్లతో స్క్రీన్ టులో 218 సీట్లతో అన్ని సౌకర్యాలను దృష్టిలో ఉంచుకొని వారు సౌకర్యంగా కూర్చునే విధంగా ఆధునిక సిట్టింగ్స్‌తో కొత్త రకం డాల్బీ అట్మాస్ 7.2 సౌండ్ సిస్టంతో మల్టీప్లెక్స్ థియేటర్‌ని నిర్మాణం చేసి సినిమా ప్రేక్షకుల కోసం అందుబాటులోకి తీసుకొచ్చామని తెలిపారు.
థియేటర్ అధినేత యలమంచిలి రామ్ మాట్లాడుతూ గుణదలలోని రాంగోపాల్ థియేటర్ నేటి నుంచి రామ్స్ థియేటర్‌గా నగరవాసులకు వినోదాన్ని అందించనుందని సంక్రాంతి పండుగ సందర్భంగా సరికొత్త సినిమాలతో రామ్ సినిమాస్ నగరవాసులను అలరించునుందన్నారు. రామ్ సినిమాస్ రెండు స్క్రీన్‌లతో, డిజిటల్ సౌండ్ సిస్టం ఏర్పాటుచేశామన్నారు. గత 48 సంత్సరాలుగా విజయవాడలో రాంగోపాల్ థియేటర్‌గా అలరించిందని ఇక నుండి రామ్ సినిమాస్‌గా అందరి ముందుకు వస్తుందన్నారు. థియేటర్‌లో విశాలమైన కార్ పార్కింగ్‌తో పాటు, స్కూటర్ పార్కింగ్ కూడా ఉందని అన్నారు. టికెట్స్ థియేటర్‌తో పాటు బుక్ మై షో ద్వారా ఆన్‌లైన్ ద్వారా బుక్ చేసుకోవచ్చని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్, యలమంచిలి రాము, దాములతోపాటు ధియేటర్ సిబ్బంది, భారీ సంఖ్యలో ప్రేక్షకులు తదితరులు పాల్గొన్నారు.