-ఇబ్రహీంపట్నం లో వడ్డె ఓబన్న జయంతోత్సవాలు
-ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఎంపి కేశినేని, ఎమ్మెల్యే వసంత
ఇబ్రహీంపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
తొలితరం స్వాతంత్య్ర సమరయోధుడు వడ్డె ఓబన్న చిరస్మరణీయుడు. బ్రిటీషు వారిపై ఓబన్న జరిపిన పోరాట పటిమ నేటి యువతరానికి స్ఫూర్తిదాయకమని విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ అన్నారు. ఇబ్రహీంపట్నం రింగ్ సెంటర్ వద్ద కొండపల్లి మున్సిపాలిటీ వడియరాజుల సంక్షేమ సంఘం నిర్వహించిన వడ్డె ఓబన్నా జయంతోత్సవ కార్యక్రమంలో ఎంపి కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్, ఎమ్మెల్సీ జనార్థన్ లతో కలిసి పాల్గొన్నారు.
ఈ సందర్బంగా ఎంపి కేశినేని శివనాథ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వడ్డె ఓబన్నా జయంతోత్సవాలు అధికారంగా నిర్వహించినందుకు ధన్యవాదాలు తెలిపారు. టిడిపి బిసిల పక్షపాతి పార్టీ అని…బిసిలకు తెలుగుదేశం పార్టీలో ఎప్పుడు ప్రాధాన్యత ఉంటుందన్నారు.వడ్డెరలకు రాజకీయ ప్రాధాన్యత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తప్పకుండా కల్పిస్తారని తెలిపారు. చదువుకోవటానికి ఇబ్బంది పడే విద్యార్ధులకు అండగా వుంటానన్నారు. అలాగే వడ్డె ఓబన్న విగ్రహాం ఏర్పాటు విషయంలో ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ తోపాటు చేయూత గా నిలుస్తానని తెలిపారు. రాష్ట్ర , కేంద్ర ప్రభుత్వాల పథకాలు వినియోగించుకుని ఆర్థికంగా ఎదిగేందుకు కృషి చేయాలని సూచించారు.
ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ కొండలను పిండి చేసే సత్తా వడ్డెర సొదరుల సొంతం అన్నారు. మెషీన్స్ లేని కాలంలో కొండలను కొట్టి ఇళ్లు, రహదారులు నిర్మించారు. రాజకీయంగా, ఆర్థికంగా ఎదిగేందుకు చేయూతగా నిలుస్తానని చెప్పారు.
ఈ కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర కార్యదర్శి జంపాల సీతారామయ్య, జనసేన మైలవరం నియోజకవర్గ అధ్యక్షుడు అక్కల గాంధీ, టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి నాగుల్ మీరా, వడియరాజ ఉద్యోగ సంఘం గౌరవ అధ్యక్షుడు డాక్టర్ తంగిర శ్రీనివాస్, కె.కోటేశ్వరమ్మ,తన్నీరు శ్రీనివాస్, ఇబ్రహీంపట్నం మండల పార్టీ అధ్యక్షుడు రామినేని రాజ పాల్గొన్నారు.