-ఉరుసు మహోత్సవాలు హాజరైన ఎంపి, ఎమ్మెల్యే వసంత, ఎమ్మెల్సీ జనార్ధన్
ఇబ్రహీంపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
కుల, మతాలకు అతీతంగా నిర్వహించే షాబుఖారి బాబా దర్గా ఉరుసు ఎంతో మహోన్నతమైనదని విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ అన్నారు. కొండపల్లిలొని సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం హజరత్ సయ్యద్ షాబుఖారి బాబా దర్గా 428 వ ఉరుసు మహోత్సవాలకు శనివారం ఎంపి కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్, ఎమ్మెల్సీ జనార్థన్, రాష్ట్ర అధికార ప్రతినిధి నాగుల్ మీరాతో కలిసి పాల్గొన్నారు. ఉరుసు మహోత్సవ కమిటీ చైర్మన్ అల్తాఫ్ బాబా వారిని సాదరంగా ఆహ్వానించి ఇస్లాం సంప్రదాయం ప్రకారం ఘనంగా సన్మానించారు. అనంతరం దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ ఎంతో పురాతన చరిత్ర కలిగిన షాబుఖారీ బాబా దర్గా ఉరుసు మహోత్సవంలో పాల్గొనటం చాలా ఆనందంగా వుందన్నారు. ఉరుసు మహోత్సవానికి అన్ని ఏర్పాట్లు చాలా బాగా చేశారని ప్రశంసించారు. ప్రతిరోజు భక్తులందరికీ అన్నదానం చేయడం అభినందనీయమన్నారు.