విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆదేశాల మేరకు ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ కూటమి నేతలతో కలిసి 49వ డివిజన్ లో పర్యటించారు. కృపానందం వీధి కొండ ప్రాంతంలో ఇటీవల వర్షాలకు కూలిన రిటైనింగ్ వాల్ ను పరిశీలించారు. రిటైనింగ్ వాల్ ను పునరుద్ధరించాలని స్థానికులు తెలపగా నిధులు మంజూరు పరిశీలనలో ఉందని ఆమోదం పొందగానే రిటైనింగ్ వాల్ నిర్మాణం చేపట్టి త్వరితగతిన పూర్తి చేస్తామన్నారు.
చిలకా మార్తమ్మ వీధిలోని వాటర్ ట్యాంక్ పరిసరాలలో అపరిశుభ్ర వాతావరణం నెలకొని ఉందని చెత్తను తొలగించాలని శానిటరీ ఇన్స్పెక్టర్ కృష్ణ ను ఆదేశించారు. పారిశుధ్య నిర్వహణలో లోపం తలెత్తకుండా పరిసర ప్రాంతాలను శుభ్రపరచాలన్నారు.
49వ డివిజన్ లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని స్థానిక ప్రజలు కోరారు.12000 మంది జనాభా ఉన్న 49వ డివిజన్ లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అందుబాటులో లేకపోవడంతో వాగు సెంటర్ కొండ ప్రాంతంలో ఉన్న ఆరోగ్య కేంద్రానికి వెళ్లలేక అనేక ఇబ్బందులకు ఎదుర్కొంటున్నామని స్థానికులు తెలిపారు.పశ్చిమలో విద్య, వైద్యం మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి ఎమ్మెల్యే సుజనా చౌదరి ప్రత్యేక దృష్టి సారించారన్నారు .అతి త్వరలోనే ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అందుబాటులోకి వస్తుందని తెలిపారు.
అదేవిధంగా ప్రైజర్ పేట లో స్థానికులకు అందుబాటులో ఉండవలసిన సచివాలయం 55వ డివిజన్ పరిధిలో ఉండటంతో అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని సచివాలయాన్ని 49వ డివిజన్ పరిధిలోకి తేవాలని స్థానికులు కోరగా సంబంధింత అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే సుజనా చౌదరి నిరంతరం కృషి చేస్తున్నారని ప్రత్తిపాటి శ్రీధర్ తెలిపారు.
కూటమినేతలు కొంపల్లి శ్రీనివాస్, కత్తి డేవిడ్, కె విక్టోరియా, పుట్ల గోపాలం, బి సామ్యూల్, బేసు శ్రీనివాస్, కుమార్ దాస్, డేవిడ్ రాజు తదితరులు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
ఆకాంక్షిత బ్లాక్ కార్యక్రమం (ఏబీపీ)పై అధికారులతో కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
-పెనుగంచిప్రోలు ఇబ్రహీంపట్నం బ్లాక్ లను టాప్ టెన్ లో నిలపండి…. -హెల్త్ ,ఎడ్యుకేషన్, న్యూట్రిషన్ పై దృష్టి సారించండి….. -కలెక్టర్ …