Breaking News

మద్దతు. ధరల ప్రకారం రబీలో పండించిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలి… : కె.రామకృష్ణ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రబీలో పండిన ధాన్యాన్ని మద్దతు ధరల ప్రకారం వెంటనే కొనుగోలు చేయాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయడంలోనూ, ధాన్యాన్ని సేకరించటంలోను తీవ్రమైన జాప్యం జరుగుతుందని దీనివల్ల మధ్య దళారులు సిండికేట్ గా ఏర్పడి తక్కువ రేటుకు కొనుగోలు చేసి రైతులను దోపిడీ చేస్తున్నారన్నారు. ఈరోజు ఎన్టీఆర్ జిల్లా, ఇబ్రహీంపట్నం మండలం, ఈల్లప్రోలు గ్రామంలో పర్యటించి ధాన్యం పండించిన రైతులతో మాట్లాడి రైతులు ధాన్యం అమ్ముకోవడంలో ఎదురవుతున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మార్చి 15 నాటికి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయవలసి ఉండగా ఏప్రిల్ రెండో తారీకు వరకు ఏర్పాటు చేయకపోవడం మరోవైపు అకాల వర్షాలతో ధాన్యం తడిసి దెబ్బతింటుందేమోనని క్వింటాలు రూ.500లకు తక్కువుకు అమ్ముకొని నష్టపోతున్నామని రైతులు చెప్పారు. ఖరీఫ్ సీజన్లో బుడమేరు వరదల వల్ల పూర్తిగా నష్టపోయామన్నారు. రబిలో సీజన్లో ఆరుగాలు శ్రమించి పండించిన ధాన్యానికి మద్దతు ధర కూడా దక్కకపోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి మద్దతు ధరల ప్రకారం ఫైన్ క్వాలిటీ రకం ధాన్యాన్ని క్వింటాలు రూ.2300లకు,సాదారణ రకం ధాన్యాన్ని రూ.2280లకు కొనుగోలు చేయడానికి వెంటనే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. కొనుగోలు కేంద్రాల అధికారులు,మిల్లర్లు రైతుల కష్టార్జితాన్ని కాజేస్తున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలలో మానిటరింగ్ సెల్ ఏర్పాటు చేసి ధాన్యం సేకరణకు అవసరమైన చర్యలు చేపట్టాలని,రైతులకు అవసరమైన గన్ని బ్యాగులను అందించాలని కోరారు యన్ టి ఆర్ జిల్లా సిపిఐ కార్యదర్శి దోనేపూడి శంకర్ మాట్లాడుతూ తక్షణమే బుడమేరు వల్ల తెగిపోయిన కట్టలను నిర్మించాలని, మరోసారి బుడమేరు వల్ల రైతుల నష్టపోకుండా పెద్ద ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ కవులు రైతుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి. జమలయ్య, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు సిహెచ్. కోటేశ్వరావు, ఆంధ్రప్రదేశ్ రైతుసంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు మల్నీడీ యల్లమందరావు, ఆంధ్రప్రదేశ్ కౌలురైతుల సంఘం జిల్లా అధ్యక్షుడు బుడ్డి రమేష్, ఉపాధ్యక్షులు పెయ్యల వెంకటేశ్వరరావు, రైతు, కౌలురైతు సంఘాల నాయకులు నిమ్మగడ్డ వాసు,సాంబశివరావు,సిద్దయ్య తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

పెట్టుబడులతో రండి..భరోసా కల్పించే బాధ్యత మాది

-ముంబయిలో జరిగిన దక్షిణాసియా 20వ హోటల్ ఇన్వెస్ట్ మెంట్ కాన్ఫరెన్స్ 2వ రోజు వర్క్ షాప్ లో జాతీయ, అంతర్జాతీయ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *