విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ నైపున్యాభివృద్ధి సంస్థ (SEEDAP) మరియు DRDA సంయుక్త ఆధ్వర్యంలో, దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్ యోజన (DDU GKY) పధకం కింద జర్మనీదేశంలో సర్సింగ్ ఉద్యోగాలకు అర్హులైన వారినుంచి దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుందని ఉమ్మడి కృష్ణా జిల్లా డిఆర్ డిఏ (SEEDAP) పధక సందాలకులు హరిహర నాథ్ ఒక ప్రకటనలో తెలిపారు.
బి.ఎస్సీ మరియు యంఎస్సీ నర్సంగ్ అర్హత కలిగి ఉండి 20 నుంచి 35 సంవత్సరాల లోపు వయస్సు ఉన్న వారు అర్హులన్నారు. సాధారణ ఆసుపత్రులలో అనుభవం కలిగి, జర్మ ని భాష నేర్చుకోవాడనికి ఆసక్తి ఉన్నవారు, జర్మని భాష బీ 2 స్థాయి వరకు ఉచిత భోజన వసతి, ఉచిత శిక్షణ తరగతులకు హాజరుకావాల్సి ఉంటుందని, ఎంపికైన వారికి విమాన చార్జీలు ఉచితమని, జీతం నెలకు రూ.2.4 to 3.10 లక్షలని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ దార్వ ఈ ఉద్యోగ అవకాశాలను కల్పించడం జరుగుతుందన్నారు. విజయవాడ నగరంలోని భవానిపురం స్కిల్ కాలేజీ నందు ఏప్రిల్ నెల 14వ తేదీ నుండి తరగతులు ప్రారంభంకానున్నాయని, పూర్తివివరాలకు 99630 74879, 94927 19843, 72888 73337 నంబర్లను సంప్రదించవచ్చునని ఉమ్మడి కృష్ణా జిల్లా డిఆర్ డిఏ పధక సంచాలకులు హరిహర నాథ్ ఆ ప్రకటనలో తెలిపారు.
Prajavartha Online Telugu News