-డిల్లీ రావు ఐఏఎస్ వ్యవసాయ సంచాలకులు
-ముఖ్యమంత్రి సూచనలను అమలు పరుస్తూ రాష్ట్ర స్థూల ఆదాయంలో వ్యవసాయ పంటల ద్వారా స్థూల విలువ పెంపునకు గట్టిగా కృషి చేయాలని వ్యవసాయ అధికారులను ఆదేశించిన డిల్లీ రావు
– వ్యవసాయ భూములలో పంటల సాంద్రత ఎక్కువగా ఉంచడం, స్వల్ప, మధ్య కాలిక పంటలతో సంవత్సరములో మూడు పంటల సాగు విధానం,అంతర పంటలు, మిశ్రమ పంటలను సాగు ద్వారా స్థూల విలువ పెంపునకు దోహదం చేసేలా ప్రణాళిక రూపొందించాలని తెలిపారు.
-స్థూలవిలువ పెంపునకు చేపట్టాల్సిన కార్యాచరణపై జిల్లాలలో కార్యశాలలను నిర్వహించవలసినదిగా జిల్లా వ్యవసాయ అధికారులకు ఆదేశం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రములోని వ్యవసాయ అధికారులు, విత్తనాభివృద్ధి సంస్థ అధికారులతో విత్తన సరఫరా యాజమాన్యం,వ్యవసాయ రంగంలో స్థూల విలువ పెంపునకు కార్యాచరణ పై గురువారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి వారి ఆదేశాల మేరకు వ్యవసాయంలో స్థూల ఆదాయం 65000 కోట్ల రూపాయల సాధించే దిశగాఇప్పటినుండే వ్యవసాయ కార్యాచరణ రూపొందించుకోవాలని తెలియ చేస్తూ, వ్యవసాయ భూములు ఖాళీ పెట్టకుండా మార్చి నెల నుండి జూన్ మాసం వరకు పంపు సెట్లు,బోర్ల ద్వారా చేసే వేసవి పంటల సాగు విధానం ద్వారా వచ్చే ఆదాయం విలువ జోడించే ప్రక్రియకు దోహదపడుతుందని తెలిపారు.రాష్ట్రములో మారిన వాతావరణ పరిస్థితులలో అక్కడక్కడ కురుస్తున్న తేలికపాటి నుండి ఓమోస్తరు వర్షాలను సద్వినియోగం చేసుకుని,బోర్లు,పంపుసెట్ లు వున్న భూములలో పెసర,నువ్వులు,పిల్లి పెసర, మినుము,వేరుశనగ తదితర పంటలసాగు చేపట్టాలని కోరారు.
రాష్ట్రములో వేసవి పంటల సాగుకు 90,000 హెక్టార్ల విస్తీర్ణంను లక్ష్యంగా పెట్టుకున్నామని,కాబట్టి వేసవి పంటల సాగు వివరములను ఈ-పంట లో తప్పనిసరిగా నమోదు చేయాలని ఆదేశించారు.గడచిన కొన్ని సంవత్సరాలనుండి రాష్ట్రములోని కొన్ని ప్రాంతాలలో బోర్ల కింద ఈ వేసవి సాగు విధానం ఆచరణలో వున్నదని,అటువంటి వాటిని తక్షణమే గుర్తించి,తప్పనిసరిగా ఈ పంటలో నమోదు చేయాలని ఆదేశించారు.ఏలూరు, యన్.టి.ఆర్ జిల్లాలలోని మామిడి తోటలలో అంతరపంటగా సాగులో వున్న ఉలవలు,ఉత్తర కోస్తా ప్రాంతాల్లో ఖరీఫ్ విత్తనం కోసం సాగుచేసే నువ్వులు,రాయలసీమ జిల్లాలకు వేరుశనగ విత్తనం కోసం నెల్లూరు జిల్లాలో సాగులో వున్న వేరుశనగ పంటల సాగువివరములను సత్వరమే ఈ పంటలో నమోదు చేయాలని ఆదేశించారు.
ఇప్పటికే సాగులో ఉన్నవాటిని మొదటగా గుర్తించటం మరియు బోర్ల కింద మరింత విస్తీర్ణం పెంచే దిశగా ప్రయత్నం చేయాలని ఆదేశించారు.బోర్లు, పంపుసెట్ లు కింద ఈ వేసవి పంటల సాగు వల్ల వ్యవసాయ ఉత్పత్తుల ద్వారా రాష్ట్ర స్థూల ఆదాయానికి ఏ మేర విలువ జోడింపునకు దోహద పడతాయో దిగువ సిబ్బందికి జిల్లా స్థాయిలో కార్యశాలలను నిర్వహించి వారిలో అవగాహన కల్పించాలని జిల్లా వ్యవసాయ అధికారులను కోరారు .సమయం తక్కువుగా వున్న మూలముగా,లక్ష్యం సాధించేదిశగా కార్యశాలలలో లోతైన నాణ్యమైన చర్చలతోపాటు శాస్త్రీయ విశ్లేషణ చేసుకుంటూ కార్యాచరణ ప్రణాళికను అమలు చేయాలని ఆదేశించారు.వేసవి పంట విస్తీర్ణం నామ మాత్రముగా వున్నకర్నూలు,అన్నమయ్య,అనంతపూర్,ప్రకాశం జిల్లా అధికారులను ఆరా తీశారు.ఉద్యాన పంటలు సాగు ఎక్కువుగా వున్న దృష్ట్యా వాటిలో అంతర పంటలుగా పెసర,ఉలవలు సాగుచేయాలని కోరారు.
ఈ కార్యక్రమములో అదనపు వ్యవసాయ సంచాలకులు వినయ్ చంద్ మాట్లాడుతూ రాయితీ పై విత్తన సరఫరా మార్గ దర్శకాలు,రాష్ట్రములోని వివిధ విత్తనాబివృద్ధి క్షేత్రాలలో అందుబాటులో ఉన్న విత్తనాల వివరాలను తెలియచేశారు.సంయుక్త సంచాలకులు, కృపదాస్ మాట్లాడుతూ ఖరీఫ్ సీజన్ లో విత్తనాలకు కొరత లేకుండా చూడాలని క్షేత్ర స్థాయి వ్యవసాయ అధికారులు విత్తన చట్టం లోని వివిధ అంశాలపై పూర్తి స్థాయి అవగాహన కలిగి వుండి నకిలీలను అరికట్టాలని కోరారు .
Prajavartha Online Telugu News