Breaking News

సీఎంఆర్ఎఫ్ పేదలకు వరం

-రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్
-మంత్రి కందుల దుర్గేష్ చేతుల మీదుగా 43 మంది బాధిత లబ్ధిదారులకు వైద్య సేవలు నిమిత్తం రూ.30,31,151 విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులు, ఒక ఎల్ వోసీ లెటర్ అందజేత
-ఇప్పటివరకు నిడదవోలు నియోజకవర్గంలో 235 మంది లబ్ధిదారులకు రూ.2.14 కోట్ల లబ్ధి చేకూర్చామని వెల్లడి
-రాష్ట్రంలో పేద ప్రజలకు విద్య, వైద్యం పూర్తి స్థాయిలో అందేందుకు సీఎం చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారన్న మంత్రి దుర్గేష్
-సీఎం చంద్రబాబు నాయుడుకు మంత్రి కందుల దుర్గేష్ కు కృతజ్ఞతలు తెలిపిన బాధిత లబ్ధిదారులు
-పేద ప్రజలకు అండగా ఉంటున్న సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లకు ధన్యవాదాలు తెలిపిన మంత్రి దుర్గేష్

నిడదవోలు, నేటి పత్రిక ప్రజావార్త :
సీఎంఆర్ పేదలకు వరమని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. మంగళవారం నిడదవోలు క్యాంపు కార్యాలయంలో మంత్రి కందుల దుర్గేష్ చేతుల మీదుగా 43 మంది బాధిత లబ్ధిదారులకు వైద్య సేవలు నిమిత్తం రూ.30,31,151 విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులు, ఒక ఎల్ వోసీ లెటర్ నిడదవోలు మంత్రి క్యాంపు కార్యాలయంలో మంగళవారం అందజేశారు. అందులో 42 మంది లబ్ధిదారులకు రూ. 23,31,151 విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులు, రూ.7 లక్షల విలువైన ఎల్ వోసీ సిఫారసు లెటర్ ను రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ అందించారు. ఇప్పటివరకు 12 నెలల కాలంలో నిడదవోలు నియోజకవర్గంలో 235 మంది లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్, ఎల్ వోసీల ద్వారా రూ.2,14,74,593 ల లబ్ధి చేకూర్చామని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. దీన్ని బట్టి చూస్తే పేద ప్రజల ఆరోగ్యం గురించి కూటమి ప్రభుత్వం ఎంత తపన పడుతుందో ఈ అంకెలు నిదర్శనమన్నారు. పేదల ఆరోగ్యానికి సీఎంఆర్ఎఫ్ సంజీవని లాంటిదని, పేదలకు సీఎంఆర్‌ఎఫ్‌ తో భరోసా కలుగుతుందని, నిరుపేదల ప్రాణాలు కాపాడుతోందని వెల్లడించారు.

రాష్ట్రంలో పేద ప్రజలకు విద్య, వైద్యం పూర్తిస్థాయిలో అందేందుకు సీఎం చంద్రబాబునాయుడు కృషి చేస్తున్నారని మంత్రి దుర్గేష్ అన్నారు. నిరంతరం పేద ప్రజలకు అందుబాటులో ఉంటూ పేద ప్రజల ఆరోగ్యం విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఆరోగ్యం విషయంలో ఎవరికైనా ఇబ్బందులు ఉంటే వెంటనే తమకు దరఖాస్తు అందిస్తే తాము సీఎంఆర్ఎఫ్ కు దరఖాస్తులు చేరవేస్తామని తద్వారా ఆర్థిక సాయం అందించేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రి దుర్గేష్ ప్రజలకు సూచించారు. ఇది నిరంతర ప్రక్రియని తెలిపారు. ప్రతి 15 రోజులకు ఒకసారి పంపిణీ కార్యక్రమం ఉంటుందని వివరించారు. ఈ సందర్భంగా పేద ప్రజలకు అండగా ఉంటున్న సీఎం చంద్రబాబు నాయుడుకు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు మంత్రి కందుల దుర్గేష్ కృతజ్ఞతలు తెలిపారు.

సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందుకున్న అనంతరం బాధిత లబ్ధిదారులు సీఎం చంద్రబాబునాయుడుకు, మంత్రి కందుల దుర్గేష్ కు కృతజ్ఞతలు తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

శ్రీ కృష్ణాష్టమి వేడుకలలో దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఈ రోజు శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా తూర్పు నియోజకవర్గంలో వైస్సార్ కాంగ్రెస్ పార్టీ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *