Breaking News

క్షేత్ర స్థాయిలో కలెక్టర్ ప్రజలతో ముఖాముఖి

-పెన్షన్ పంపిణీలో లోపాలపై ప్రజా స్పందన పై క్షేత్ర స్థాయిలో పరిశీలన
-ప్రజలతో మమేకంగా పనిచేయాలని సచివాలయ సిబ్బందికి సూచన
-కలెక్టర్ పి ప్రశాంతి

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెలా ఒకటవ తేదీన అర్హత కలిగిన లబ్దిదారులకు వారి నివాసాల వద్దకు వెళ్లి పెన్షన్ పంపిణీ చేసేందుకు కట్టుబడి ఉందని, ఈ కార్యక్రమం ప్రజల సంతృప్తికి దోహదపడేలా కార్యకలాపాలు నిర్వహించాలని పెన్షన్ పంపిణీ అధికారులకు (వార్డు, వాలంటీర్ స్థాయి అధికారులు) జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి స్పష్టం చేశారు. 49వ వార్డులో పెన్షన్ పంపిణీ ప్రక్రియపై స్వయంగా సమీక్షించేందుకు కలెక్టర్ గారు శుక్రవారం సాయంత్రం లబ్ధిదారులను మరియు స్థానిక ప్రజలను ప్రత్యక్షంగా కలసి, వారి అభిప్రాయాలు స్వయంగా తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ, ఇటీవలి బదిలీల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాలను అనుసరించి పలువురు సచివాలయ సిబ్బందిని బదిలీ చేసిన సంగతి తెలిసిందే అన్నారు. కొత్త ప్రదేశాల్లో విధులు ప్రారంభించిన వారు స్థానిక ప్రజలతో మమేకంగా పనిచేయాలని, వారినీ అర్థం చేసుకుని, సేవలందిం చడంలో తగిన ప్రాధాన్యత చూపాలని కలెక్టర్ సూచించారు. ఈ సందర్భంగా తల్లికి వందనం, పింఛను , రేషన్ కార్డులు, ఇంటి స్థలాలు మొదలైన పథకాలు అందలేదని లబ్ధిదారులు కలెక్టర్ దృష్టికి తీసుకు రావడం జరిగింది. ఆయా ఫిర్యాదులను తక్షణమే స్వీకరించి, వాటి యధార్థ స్థితిని పరిశీలించి నివేదిక సమర్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

ఆగస్టు ఒకటవ తేదీన సింహాచలం నగర్ 49వ వార్డులో జరిగిన పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని పరిశీలించిన సందర్భంగా, ఫిర్యాదులు వచ్చే అవసరం లేకుండా ముందుగానే సమస్యలను గుర్తించి పరిష్కరించేలా ముందస్తు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. లబ్దిదారులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా సేవలందించడంలో జాప్యం చోటుచేసుకోకూడదని స్పష్టం చేశారు. కలెక్టర్ పి. ప్రశాంతి పి ప్రశాంతి మాట్లాడుతూ, సచివాలయ సిబ్బంది ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతి అర్హత కలిగిన లబ్ధిదారుడికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు శాతం నూరు అందాల్సిన బాధ్యత తమపై ఉందని కలెక్టర్ గుర్తు చేశారు. అలాగే, పౌర సేవల నాణ్యతను పెంపొందించేందుకు IVRS (ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ సిస్టమ్) ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ప్రజాభిప్రాయ సేకరణ చేపడుతున్నట్లు వెల్లడించారు. ఫిర్యాదులకు ఆస్కారం లేకుండా, పారదర్శకంగా, సమర్థంగా పౌర సేవలు అందించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కలెక్టర్ వెంట క్షేత్ర స్థాయిలో పర్యటించినా ఆర్ ఎమ్ సి అధికారి శైలజవల్లి, డీ ఆర్ డి ఎ పిడి ఎన్ వి వి ఎస్ మూర్తి, పి డి వో లు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

శ్రీ కృష్ణాష్టమి వేడుకలలో దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఈ రోజు శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా తూర్పు నియోజకవర్గంలో వైస్సార్ కాంగ్రెస్ పార్టీ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *