Breaking News

అంతర్జాతీయ వేదికపై మెరిసిన జెస్సీ – జిల్లా కలెక్టర్ ఎస్ . నాగలక్ష్మి అభినందనలు

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
జూలై 24 నుండి 29 వరకు దక్షిణ కొరియాలో జరిగిన 20వ ఆసియా రోలర్ స్కేటింగ్ ఛాంపియన్‌షిప్ 2025లో సోలో డ్యాన్స్ – సబ్ జూనియర్ విభాగంలో రజత పతకం గెలుచుకున్న గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన అంతర్జాతీయ స్కేటర్ మరియు ప్రధాన మంత్రి రాష్ట్రీయ బాల్ పురస్కార్ అవార్డు గ్రహీత జెస్సీ రాజ్ మాత్రపు తన పతకాల జాబితాలో మరో మైలురాయిని చేర్చుకున్నారు. ఈ సందర్భంగా బుధవారం జెస్సీ రాజ్ మాత్రపు గుంటూరు జిల్లా కలెక్టర్ శ్రీమతి నాగలక్ష్మి గారిని మర్యాదపూర్వకంగా కలిశారు. కలెక్టర్ గారు జెస్సీకి హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ, ఆమె భవిష్యత్ క్రీడా ప్రయాణానికి ప్రభుత్వం నుండి సంపూర్ణ మద్దతు అందిస్తామని హామీ ఇచ్చారు. అదేవిధంగా, అద్భుతమైన శిక్షణ మరియు మార్గదర్శకత్వం అందించిన ఆమె కోచ్ శ్రీ సింహాద్రి ని ప్రత్యేకంగా ప్రశంసించారు. అలాగే, జెస్సీ విజయయాత్రలో నిరంతర ప్రోత్సాహం మరియు నిబద్ధత కనబరుస్తున్న ఆమె తల్లిదండ్రులను కూడా జిల్లా కలెక్టర్ అభినందించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

శ్రీ కృష్ణాష్టమి వేడుకలలో దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఈ రోజు శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా తూర్పు నియోజకవర్గంలో వైస్సార్ కాంగ్రెస్ పార్టీ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *