రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
బుధవారం తూర్పు గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జ్ ఎన్. శ్రీలక్ష్మి రాజమహేంద్రవరం కేంద్ర కారాగారాన్ని మరియు ప్రత్యేక మహిళా కారాగారాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆహార ప్రమాణాలు మరియు ఇతర సదుపాయాలను పరిశీలించారు. కారాగారం లోని ఖైదీలతో మరియు ఖైదీల కుటుంబ సభ్యులతో మాట్లాడి, వారి సమస్యలను ఆరా తీశారు. ఖైదీల తరపున ఉచితంగా వాదించేందుకు న్యాయవాదులు కావాలన్నా, బెయిల్ పిటిషన్లు దాఖలు చేయాలన్నా, పై కోర్టుల్లో అప్పీలు వేయాలన్నా లేదా మరే ఇతర న్యాయ సహాయం కావాలన్నా, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సహకరిస్తుందని ఆమె తెలిపారు. అందుకు తమ అర్జీలను సంస్థ నియమించిన పారా లీగల్ వాలంటీర్ల ద్వారా అందించాలని సూచించారు. అలాగే ముద్దాయిలు, ఖైదీల కోసం పనిచేస్తున్న లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ సేవలను వినియోగించు కోవాలని కోరారు.
Prajavartha Online Telugu News