– ఎస్ ఈ.. కె. తిలక్ కుమార్
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
తూర్పు గోదావరి జిల్లాలో ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు మరియు రాబోయే మూడు రోజుల్లో భారీ వర్షాల సూచన నేపథ్యంలో, జిల్లా విద్యుత్ శాఖ అధికారులు మరియు సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని పర్యవేక్షక ఇంజనీర్ కే. తిలక్ కుమార్ గురువారం ఒక ప్రకటనలో తెలియచేసారు. ఎటువంటి విపత్తు పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు అన్ని విభాగాలు సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్, విశాఖపట్నం, జిల్లా కలెక్టర్, తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం వారి ఆదేశాల మేరకు, పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు జిల్లా విద్యుత్ శాఖ కార్యాలయం (విద్యుత్ భవన్, రాజమహేంద్రవరం) తో పాటు అన్ని డివిజన్ స్థాయిల్లో కంట్రోల్ రూములు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
కంట్రోల్ రూమ్ నంబర్లు:
సెంట్రలైజ్డ్ టోల్ ఫ్రీ నెంబర్: 1912
జిల్లా స్థాయి (రాజమహేంద్రవరం): 0883-2463354, 7382299960
డివిజన్ స్థాయి: 9490610093, 9439178874, 8332973595
ఈ కంట్రోల్ రూములు 24×7 విధానంలో పని చేస్తాయని ఆయన తెలిపారు. వర్షాల కారణంగా తెగిపోయిన విద్యుత్ తీగలు లేదా స్తంభాలను తాకరాదని, తడి చేతులతో లేదా తడి కాళ్లతో స్విచ్‌లు ఆన్/ఆఫ్ చేయరాదని ప్రజలకు ఆయన విజ్ఞప్తి చేశారు. వర్షాలు లేదా వరదల కారణంగా ఏదైనా విద్యుత్ అంతరాయం లేదా సమస్య తలెత్తిన పక్షంలో పై నంబర్లకు వెంటనే సమాచారం అందించాలని ఎస్ ఈ తిలక్ కుమార్ ప్రజలకి విజ్ఞప్తి చేశారు.
Prajavartha Online Telugu News