Breaking News

ప్రైవేట్, ప్రభుత్వ భాగస్వామ్యంతో వసతి సౌకర్యాల విస్తరణకు ప్రోత్సాహం

-పుష్కరాల కోసం హోటల్ నిర్మాణాలకు నామమాత్రపు ధరలకు భూములు
-కలెక్టర్ పి. ప్రశాంతి

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
రానున్న గోదావరి పుష్కరాల సందర్భంగా రాజమహేంద్రవరం నగరంలో హోటల్‌ నిర్మాణం చేపట్టే వారికి నామమాత్రపు ధరలకు భూములు కేటాయించనున్నట్లు జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి తెలిపారు. గురువారం సాయంత్రం బొమ్మూరు కలెక్టరేట్‌లో జిల్లాలోని హోటల్ అసోసియేషన్ ప్రతినిధులతో సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పుష్కరాల సమయంలో నగరంలో లాడ్జింగ్ సౌకర్యాల విస్తరణపై చర్చించారు. “పుష్కరాల రోజుల్లో నగరంలో రోజుకు ఒక లక్ష మందికి వసతి కల్పించే విధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. చిన్న హోటళ్లు, కాంప్లెక్సులు నిర్మించదలచిన వారికి ప్రభుత్వం నుంచి తగిన ప్రోత్సాహకాలు అందిస్తామన్నారు. ఇప్పటికే హోటళ్లు నడుపుతున్న యాజమాన్యాలు తమ సౌకర్యాలను విస్తరించాలనుకుంటే, అవసరమైన ప్రభుత్వ సహకారం అందిస్తామని పేర్కొన్నారు. అలాగే, పుష్కరాల సందర్భంగా శాశ్వత లేదా తాత్కాలిక వసతి గదులు నిర్మించేందుకు ప్రతిపాదనలు సమర్పిస్తే వాటిని పరిశీలించి ముందుకు తీసుకెళ్తామని కలెక్టర్ పి ప్రశాంతి తెలిపారు. పర్యాటక రంగం పరిశ్రమ హోదా పొందినందున ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం వివిధ రకాల ప్రోత్సాహకాలు అందించ బడతాయని స్పష్టం చేశారు.

“పుష్కరాల సమయంలో నగరానికి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా తగిన వసతి సౌకర్యాలను కల్పించడమే జిల్లా యంత్రాంగం ప్రధాన లక్ష్యం” అని కలెక్టర్ వారికి వివరించారు.

ఈ కార్యక్రమం లో రాజమహేంద్రవరం రెవెన్యూ అధికారి ఆర్. కృష్ణ నాయక్, ఎడిసి పీవీ రామలింగేశ్వర రావు , జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారి రుక్కయ్య, హోటల్ అసోసియేషన్ ప్రతినిధులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

శ్రీ కృష్ణాష్టమి వేడుకలలో దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఈ రోజు శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా తూర్పు నియోజకవర్గంలో వైస్సార్ కాంగ్రెస్ పార్టీ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *