Breaking News

79వ స్వాతంత్ర దినోత్సవానికి ఏర్పాట్లు

-ఆర్ట్స్ కళాశాల మైదానం లో అధికారులకి సూచనలు జారీ
-జాయింట్ కలెక్టర్ ఎస్. చిన్న రాముడు

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లా కేంద్రంలోని ఆర్ట్స్ కళాశాల మైదానంలో 79వ స్వాతంత్ర దినోత్సవ ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నట్లు జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్. చిన్న రాముడు తెలిపారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఆర్ట్స్ కళాశాల ప్రాంగణంలో వేడుకల ఏర్పాట్లను అధికారులతో కలిసి పరిశీలించి సూచనలు చెయ్యడం జరిగింది. అధిక వర్షాలు కురిస్తే సుబ్రహ్మణ్యం మైదానం వద్ద నిర్వహించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ రోజు వర్షం కురవని దృష్ట్యా ఆర్ట్స్ కళాశాల మైదానం లో ఆర్ ఎమ్ సి అధికారులు , రెవెన్యూ, పోలీసు , సంస్కఇతర సమన్వయ శాఖల అధికారులతో తగిన చర్యలు తీసుకోవడం జరుగుతున్నట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా రెవెన్యూ, పోలీసు, నగరపాలక సంస్థ అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో ఏర్పాట్లపై సూచనలను చెయ్యడం జరిగింది. 14 శాఖలకు చెందిన శకటాల, స్టాల్ల్స్ ప్రదర్శన , సాంస్కృతిక ప్రదర్శనలు తెలిపారు. ఈ క్రమంలో ఆర్డీవో ఆర్. కృష్ణ నాయక్, ఆర్‌ఎమ్‌సిఎడిసి పీవీ రామలింగేశ్వర రావు, డి ఆర్ డి ఎ పిడి ఎన్ వి వి ఎస్ మూర్తి, జిల్లా పశు సంవర్థక అధికారి శ్రీనివాస్ రావు, తదితర అధికారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

శ్రీ కృష్ణాష్టమి వేడుకలలో దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఈ రోజు శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా తూర్పు నియోజకవర్గంలో వైస్సార్ కాంగ్రెస్ పార్టీ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *