Breaking News

ఎస్సీ కులాలకు చెందిన అభ్యర్ధులకు హెవీ మోటార్ వెహికల్ (HMV) ఉచిత శిక్షణ

-దరఖాస్తు చేసుకునేందుకు చివరి తేదీ ఆగస్టు 28
-కార్యనిర్వాహక సంచాలకులు, జె. సత్యవతి

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
తూర్పు గోదావరి జిల్లాకు చెందిన షెడ్యూల్ కులాలకు చెందిన 5 మంది పురుషులు, 5 మంది స్త్రీలకు హెవీ మోటార్ వెహికల్ (HMV) ఉచిత శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు, ఆమేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం జిల్లా కు 10 మంది అభ్యర్థులకు శిక్షణ ఇవ్వాలని లక్ష్యాలను కేటాయించిందని జిల్లా షెడ్యూల్డ్ కులముల సహకార సంఘం లిమిటెడ్ కార్యనిర్వాహక సంచాలకులు జె. సత్యవతి శుక్రవారం ఒక ప్రకటన లో తెలియ చేశారు. ఆసక్తిగల షెడ్యూల్డ్ కులముల అభ్యర్థులు వయస్సు 20 సంవత్సరాల పైబడిన, కనీసం 1 సంవత్సరం కాలపరిమితి గల లైట్ మోటార్ వెహికల్ (LMV) లైసెన్స్ కలిగిన వారు దరఖాస్తు చేసుకోవాలన్నారు.

తూర్పు గోదావరి జిల్లా కు చెందిన అభ్యర్ధులు దరఖాస్తులు 27-08-2025 సా.5.00 గంటల లోగా కార్యనిర్వాహక సంచాలకులు, జిల్లా షెడ్యూల్డ్ కులముల సహకార సంఘం లిమిటెడ్, ప్రగతి భవన్, కాకినాడ – 533001 కు వారి దరఖాస్తులు సమర్పించవలసినవిగా కోరడమైనది.

దరఖాస్తులో పొందపరచ వలసిన వివరాలు: అభ్యర్థి పేరు, తండ్రి/భర్త పేరు, పుట్టిన తేది/వయస్సు, విద్యార్హత (జెరాక్స్ కాపీ జత చేయాలి), ఆధార్ కార్డు నెం. (జెరాక్స్ కాపీ జత చేయాలి), LMV లైసెన్స్ బ్యాడ్జి నెం., LMV లైసెన్స్ నెం. మరియు కాలపరిమితి (జెరాక్స్ కాపీ జత చేయాలి), HMV (LLR) నెం. మరియు కాలపరిమితి (జెరాక్స్ కాపీ జత చేయాలి), మొబైల్ నెం., చిరునామా పిన్ కోడ్ తో, APSRTC నియమాలకు అంగీకారం (అవును/కాదు) , కుల ధృవీకరణ పత్రం తప్పనిసరిగా జతచేయాలనీ కోరారు..అభ్యర్థి APSRTC నియమ నిబంధనలకు అనుగుణంగా HMV శిక్షణ తీసుకోవడానికి తన వివరాలు సరైనవని, నిజాయితీతో అంగీకరిస్తున్నట్లు సంతకం చేస్తూ స్వీయ ధ్రువీకరణ పత్రం అందచేయాలని తెలియ చేశారు. ఏమైనా సందేహాలు ఉన్నా, మరింత సమాచారం కోసం అసక్తి గల అభ్యర్థులు అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కే..నందేశ్ వారి సెల్ నెం: 76719 49476 ను ఆఫీస్ సమయంలో సంప్రదించాలని కోరారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

శ్రీ కృష్ణాష్టమి వేడుకలలో దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఈ రోజు శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా తూర్పు నియోజకవర్గంలో వైస్సార్ కాంగ్రెస్ పార్టీ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *