– జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
తూర్పు గోదావరి జిల్లాలో బ్రెజిల్ ప్రతినిధుల బృందం పర్యటన ప్రకృతి వ్యవసాయానికి అంతర్జాతీయ ప్రాధాన్యతను తెచ్చి పెడుతుందని జిల్లా కలెక్టర్ శ్రీమతి కీర్తి చేకూరి ఒక ప్రకటనలో తెలిపారు. బ్రెజిల్ COP–30 ఆతిథ్యం, భారత్దేశం లో జరుగుతున్న G20 అధ్యక్ష బాధ్యతల నేపథ్యంతో ఈ పర్యటన ప్రత్యేకంగా నిలవనుందని ఆమె పేర్కొన్నారు.
బ్రెజిల్ నుండి వచ్చిన ఈ బృందానికి Mrs. వివియన్ లిబోరియో డి అల్మెయిడా నాయకత్వం వహించగా, Mr. సాండ్రో స్కూజా డ సిల్వా (UNICAFES), Mrs. జాయిస్ అపరెసిడా లోప్స్ (UNICRAB) ముఖ్య ప్రతినిధులుగా వ్యవసాయ విధానాలపై క్షేత్ర స్థాయి పరిశీలన చేయనున్నారనీ జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. ఈ పర్యటనలో 27 మంది సభ్యులు పాల్గొననున్నట్లు తెలియ చేశారు.
మొదటి బృందం పర్యటన వివరాలు:
అక్టోబర్ 4: పెరవలి మండలం, ముక్కామల గ్రామం
అక్టోబర్ 5: కొవ్వూరు మండలం కాపవరం, దేవరపల్లి మండలం యర్నగూడెం గ్రామాలు
→ ఈ బృందానికి సమన్వయ అధికారులు జకీర్ మరియు మధు మోహన్, వీరితో పాటు ఇతర సాంకేతిక, కమ్యూనికేషన్ విభాగాల సిబ్బంది ఉంటారు.
రెండవ బృందం పర్యటన వివరాలు:
అక్టోబర్ 4: కొవ్వూరు మండలం కాపవరం
అక్టోబర్ 5: దేవరపల్లి మండలం కూరుకురు, పల్లంట్ల, యర్నగూడెం గ్రామాలు
→ ఈ బృందానికి సమన్వయ అధికారులు సుధాకర్ మరియు హుమాయూన్, అనుబంధ సాంకేతిక బృందం, కమ్యూనికేషన్ విభాగం అధికారులు కూడా తోడ్పడతారు.
జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి అన్ని విభాగాధికారులు పరస్పర సమన్వయం చేసుకుని ఈ పర్యటన విజయవంతం అయ్యేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆయా బృందాలు 4, 6 తేదీల్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు పర్యటించనున్నట్లు తెలిపారు.
Prajavartha Online Telugu News