-వర్షాల నేపథ్యంలో జిల్లాలోని అన్ని విభాగాలు అధికారులు , సిబ్బంది సిద్ధంగా ఉండాలని సూచనలు
-కలెక్టర్ కీర్తి చేకూరి
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
దక్షిణ తూర్పు అరేబియా సముద్రంలో ఏర్పడిన తీవ్ర ఆవర్తనం (Depression) మరియు తమిళనాడు తీరానికి సమీపంగా దక్షిణ పశ్చిమ బంగాళాఖాతంలో కొనసాగుతున్న బలమైన తక్కువ పీడన ప్రాంతం (Well Marked Low Pressure Area) కారణంగా వచ్చే 24 గంటల్లో వాతావరణంలో మార్పులు, వర్షపాతం తీవ్రత పెరిగే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ జారీ చేసిన National Bulletin No.3 (22.10.2025, 1130 hrs IST) పేర్కొనడం జరిగిందని, ఈ నేపథ్యంలో జిల్లా పరిధిలోని అన్ని శాఖలను అప్రమత్తం చేస్తూ జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి ఆదేశాలు జారీ చేసి నట్లు జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి గురువారం ఒక ప్రకటనలో తెలియ చేశారు. తీర ప్రాంతాలు, నదీ పరివాహక మండలాలు, తక్కువ ఎత్తులో ఉన్న గ్రామాలలో అధికారులు ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని, అవసరమైతే తక్షణ రక్షణ చర్యలు చేపట్టేలా సిద్ధంగా ఉండాలని సూచించడం జరిగిందన్నారు.
“వాతావరణ శాఖ హెచ్చరికల ప్రకారం వచ్చే 24 గంటల్లో కొన్ని ప్రాంతాల్లో భారీవర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో రెవెన్యూ, పంచాయతీ రాజ్, విద్యుత్, రోడ్లు, జలవనరులు, వ్యవసాయ, నీటిపారుదల శాఖలు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ కీర్తి చేకూరి ఆదేశించడం జరిగింది. ప్రతి మండలంలో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేయడం, సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.
వాతావరణ శాఖ తీర ప్రాంతాల మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లకూడదని సూచిస్తూ, ఇప్పటికే సముద్రంలో , నది ప్రాంతంలో ఉన్న పడవలు తక్షణమే తీరానికి చేరుకోవాలని జిల్లా యంత్రాంగం ద్వారా సమాచారం అందించాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రజలు వర్షాకాలంలో విద్యుత్ తీగలు, చెట్లు కూలిపోవడం వంటి ప్రమాదాల నుండి దూరంగా ఉండాలని, అధికారుల సూచనలను పాటించాలని కలెక్టర్ సూచించారు. వాతావరణ పరిస్థితులను నిరంతరం పర్యవేక్షిస్తున్నా మని, అవసరమైతే తక్షణ చర్యలు తీసుకునేలా అన్ని విభాగాలు సిద్ధంగా ఉన్నాయని కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు.
Prajavartha Online Telugu News