నిడదవోలు/ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
‘మొంథా’ తుఫాన్ ప్రభావం దృష్ట్యా ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని నిడదవోలు తహశీల్దార్ కార్యాలయంలో సోమవారం అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి సూచనలు అందజేసిన రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్. ప్రజల భద్రతను ప్రాధాన్యంగా తీసుకుని, అధికారులు పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉండాలని, తాగునీటి సరఫరా, విద్యుత్, రవాణా, వైద్య సేవలు వంటి అత్యవసర సేవలకు ఎటువంటి అంతరాయం కలగకుండా సమర్థవంతమైన చర్యలు చేపట్టాలని మంత్రి ఆదేశించారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు సమయానుకూలంగా చేపట్టాలని, అవసరమైతే నిత్యావసర సరఫరాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం “మొంథా” తుఫాన్‌ను ఎదుర్కొనేందుకు అన్ని విధాలా సిద్ధంగా ఉందని, ప్రజలు భయపడకుండా అప్రమత్తంగా ఉండాలని మంత్రి కందుల దుర్గేష్ సూచించారు.
Prajavartha Online Telugu News