రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ప్రభుత్వం చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ (సి.పి. బ్రౌన్) జయంతిని రాష్ట్ర పండుగగా నిర్ణయించిన సందర్భంగా నవంబర్ 10వ తేదీ (సోమవారం) ఉదయం 10.30 గంటలకు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కార్యక్రమం నిర్వహించనున్నట్లు జిల్లా రెవెన్యూ అధికారి టి. సీతారామ మూర్తి ఆదివారం ఒక ప్రకటనలో తెలియ చేశారు. ఈ సందర్భంగా చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ చిత్రపటానికి జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి, ఇతర అధికారులు పుష్పమాల అర్పించి నివాళులు అర్పిస్తారని తెలిపారు. అందరూ అధికారులు , సిబ్బంది తప్పని సరిగా హాజరు కావాలని కోరుతున్నాము.
Prajavartha Online Telugu News