మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
బందరు ఆర్డీఓ ఎస్ఎస్ కె.ఖాజావలి నగరంలో 50వ సచివాలయం, నారాయణ పురంలో అర్బన్ హెల్త్ సెంటర్ సందర్శించారు. తొలుత 50వ సచివాలయం సందర్శించిన ఆర్టీఓ సచివాలయం లో వివిధ పథకాల సమాచారం, లబ్దిదారుల వివరాలతో డిస్ ప్లే బోర్డులు పరిశీలించారు. సచివాలయ సిబ్బంది బయోమెట్రిక్ హాజరు పరిశీలించి సచివాలయ పరిధిలో ఫీవర్ సర్వే, కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమాలు అమలు తీరుపై ఆరా తీశారు. సంబంధిత రికార్డులు పరిశీలించారు. జగనన్న శాశ్వత గృహహక్కు పథకం క్రింద ఇళ్ల పట్టాలు పొందిన లబ్దిదారులలో ఎంతమంది గృహనిర్మాణాలు మొదలు పెట్టారు. ఇంకా ఎంత మంది మొదలు పెట్టాలి అని అరా తీశారు. గృహనిర్మాణం వేగవంతం చేయాలని అన్నారు. అనంతరం నారాయణపురంలో అర్బన్ హెల్త్ సెంటర్ సందర్శించిన ఆర్డీట సిబ్బంది హాజరుతో పాటు ఓపీ సేవలు, కోవిడ్ టెస్టుల నిర్వహణ, కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రగతి పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. అనంతరం బందరు మండలం ఎస్ఎన్ గొల్లపాలెం గ్రామంలో సచివాలయం, అంగన్‌వాడీ కేంద్రం సందర్శించారు. సచివాలయ సిబ్బందితో సమావేశమై ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న జగనన్న శాశ్వత గృహహక్కు పథకం క్రింద లబ్దిదారులందరూ ఇళ్లు నిర్మించుకొనేలా చూడాలని జిల్లా కలెక్టర్ వారి ఆదేశాల మేరకు ప్రతి ఇంజనీరింగ్ అసిస్టెంట్ రోజూ కనీసం 5 గృహాలు నిర్మాణాలు ప్రారంభించేలా చూడాలని అన్నారు. సచివాలయ పరిధిలో బియ్యంకార్డుల జారీ, వివిధ పథకాల అమలు తీరును పరిశీలించారు. అంగన్‌వాడీ కేంద్రంలో పిల్లల హాజరు పరిశీలించారు. జగనన్న సంపూర్ణ పోషణ క్రింద గర్భిణీలకు పాలు, గుడ్లు, బియ్యం , పౌష్టికాహారం పంపిణీ పై ఆరా తీశారు. సంబంధిత రికార్డులు పరిశీలించి సిబ్బందికి తగిన సూచనలు చేశారు. అనంతరం గ్రామంలో కొత్తగా నిర్మిస్తున్న సచివాలయం, హెల్త్ సెంటర్ భవన నిర్మాణాలు పరిశీలించి త్వరగా పూర్తి చేయాలని అన్నారు. నిర్మాణంలో ఏవైనా సమస్యలు వుంటే తమ దృష్టికి తేవాలన్నారు. జడ్ పి డిప్యూటీ సిఇఓ నాగమహేశ్వరరావు, తహసీల్దార్ డి.సునీల్ బాబు ఆర్డీఓ వెంట ఉన్నారు.
Tags machilipatnam
Check Also
డిల్లీలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి పర్యటన
-రవాణా వ్యవస్థపై క్షేత్ర స్థాయిలో సమీక్షా -రోడ్డు భద్రతా విధి విధానాలపై మంత్రి పరిశీలన -తెలంగాణ రవాణా శాఖ మంత్రి …