Breaking News

భక్తులకు మెరుగైన వసతులు కల్పించేందుకు నిరంతర పర్యవేక్షణ…

ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త :
పత్రికా ప్రకటన దుర్గమ్మ దర్శనానికి విచ్చేసే భక్తులకు మెరుగైన వసతులు కల్పించేందుకు నిరంతర పర్యవేక్షణ చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ జె.నివాస్ తెలిపారు. శుక్రవారం దుర్గాఘాట్ వద్దవున్న మోడల్ గెష్టు హౌస్ నందు ఏర్పాటుచేసిన విలేఖర్లు సమావేశంలో జిల్లా కలెక్టర్ జె.నివాస్, నగర పోలీస్ కమీషనర్ బత్తిన శ్రీనివాసులు సంయుక్తంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ దుర్గమ్మ దర్శనం కోసం వచ్చే భక్తుల కోసం అన్ని సౌఖర్యములు పూర్తి అయ్యాయని, నిరంతర పర్యవేక్షణ చేస్తూ ఇంకా సౌఖర్యాల మెరుగుదలకు కృషిచేస్తున్నట్లు తెలిపారు. కొవిడ్ దృష్టిలో వుంచుకుని కొవిడ్ నిబంధనలు పాటిస్తూ భక్తులకు మెరుగైన దర్శనం కల్పిస్తున్నట్లు తెలిపారు. వినాయకుడి గుడి వద్ద నుండి అమ్మవారి దేవస్థానం వరకు క్యూలైన్లలో వచ్చే భక్తులకు వద్య మద్యలో శానిటేషన్ చేస్తున్నట్లు తెలిపారు. పలు ప్రాంతాలలో 217 మంది పారిశు ద్ధ్య కార్యమాలకు వినియోగిస్తున్నట్లు తెలిపారు. 45 శానిటరీ ఇన్ స్పెక్టర్లతో పాటు ఇతర సిబ్బందిని విధులకు కేటాయించి నిరంతర పారిశుద్ధ్య పర్యవేక్షణ జరుగుతుందన్నారు. 150 టాయిలెట్ను అందుబాటులో వుంచడం జరిగిందన్నారు. భక్తులకు క్యూలైన్లలో నిరంతర త్రాగునీటి సరఫరాలకు 150 మంది వాలంటీర్ల సేవలను వినియోగించడం జరుగుతుందన్నారు. అలాగే 10 మెడికల్ క్యాంపులు ఏర్పాటుచేయడంతో పాటు, వ్యాక్సినేషన్ సెంటర్‌ను కూడా అందుబాటులో వుంచడం జరిగిందన్నారు. ఇప్పటి వరకు 50 మంది భక్తులు వ్యాక్సిన్ వేయించుకోవడం జరిగిందన్నారు. కేశఖండనశాలలో కొవిడ్ నిబంధనలు పాటిస్తూ అక్కడే టిక్కెట్ కౌంటర్లను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. 8 వేల మంది భక్తులు నిత్యాన్నదాన కార్యక్రమాన్ని వినియోగించుకున్నట్లు తెలిపారు. రేపటి నుండి హెలిరైడ్ ఇందిరాగాంధి స్టేడియం నుండి ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని దేవదాయ శాఖా మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ప్రారంభించనున్నట్లు తెలిపారు. 6 నిమిషాలకు రు.3,500/-, 10 నిమిషాలకు రు.6,000/-లు ధరగా నిర్ణయించడం జరిగిందన్నారు. నగరంలోని విఎంసి ఎదురుగా, వినాయకుని గుడివద్ద, పున్నమిఘాట్ వద్ద 3 ప్రాంతాలలో వృద్ధుల, దివ్యాంగుల ప్రయాణ సౌఖర్యం కొరకు దేవస్థానం బస్సులను ఏర్పాటుచేయడం జరిగిందన్నారు. గత రెండు రోజుల్లో తమ దృష్టికి వచ్చిన చిన్న చిన్న ఇబ్బందులను పరిగణలోనికి తీసుకుని వివిఐపిలకు, అధికారులకు వివిద రకాల రంగుల్లో వాహన పార్లను జారీచేయనున్నట్లు తెలిపారు.
నగర పోలీస్ కమీషనర్ బత్తిన శ్రీనివాసులు మాట్లాడుతూ భక్తులు ప్రశాంత వాతావరంలో దుర్గమ్మను దర్శించుకునేలా 3 షిప్టులలో పోలీసు సిబ్బందికి విధులను కేటాయించి పర్యవేక్షించడం జరుగుతుచున్నదని తెలిపారు. ఇప్పటి వరకు ట్రాఫిక్ ను మళ్ళించవలసిన అవసరం రాలేదని, మూల నక్షత్రం రోజున అవసరమైతే హైవే నుండి మళ్ళించడం జరుగుతుందన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

డిల్లీలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి పర్యటన

-రవాణా వ్యవస్థపై క్షేత్ర స్థాయిలో సమీక్షా -రోడ్డు భద్రతా విధి విధానాలపై మంత్రి పరిశీలన -తెలంగాణ రవాణా శాఖ మంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *