విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
లబ్బీపేట ఎస్‌ఎస్ కన్వెన్షన్‌లో రెండు రోజుల పాటు నిర్వహించే క్రెడాయ్ ప్రాపర్టీషోను ఆదివారం విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శ్రీనివాస్ (నాని), తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని నాని మాట్లాడుతూ సొంతింటి కల నెరవేర్చుకోవాలనే వారి సౌలభ్యం కోసం భవన నిర్మాణ సంస్థలు, స్థిరాస్తి సంస్థలు, రుణాలను అందించే బ్యాంకులు, భవన నిర్మాణ సామాగ్రి సంస్థలను ఒకే వేదిక పైకి తీసుకురావడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న క్రెడాయ్ విజయవాడ ఛాప్టర్ అధ్యక్షుడు కె.రాజేంద్ర, స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా సీజీఎం సంజయ్ సహాయ్, యూనియన్ బ్యాంక్ సీజీఎం పి.బ్రహ్మానందరెడ్డి, క్రెడాయ్ రాష్ట్ర ఛైర్మన్ ఎస్.వెంకట్రామయ్య, రాష్ట్ర అధ్యక్షుడు బి.రాజా శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు వైవీ రమణరావు, అడ్వజైరీ ఛైర్మన్ ఆళ్ల శివారెడ్డి, ప్రాపర్టీ షో కన్వీనర్ డి.రాంబాబు, విజయవాడ ఛాప్టర్ నగర కార్యదర్శి కె.రమేష్, కె రవి కుమార్, అంకినీడు, ఆర్‌వీ స్వామి, టి.వంశీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
ప్రధాని మోదీ ప్రపంచం మెచ్చిన నాయకుడు
-అభివృద్ధి, సంక్షేమం, సంస్కరణలు, సుపరిపాలన మోదీ నినాదాలు -ఒకేరోజున రూ.2,08,548 కోట్ల పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు ఒక రికార్డ్ -ఇంతటి …