-నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహనరెడ్డి ప్రజా సంకల్ప యాత్రలో మహిళలకు ఇచ్చిన మాట ప్రకారం అధికారం చేపట్టిన అతికొద్ది కాలంలోనే రాష్ట్ర వ్యాప్తంగా మహిళల పేరుతొ పేద కుటుంబాలకు గూడు కల్పించాలనే నైపద్యంలో ఇళ్ళ పట్టాలు ఇవ్వటంతో టి.డి.పి మనుగడ కోల్పోయింది. ఇంత పెద్ద మొత్తంలో ఇళ్ళ పట్టాలు మహిళల పేరుతొ పంపిణి చేయటం చరిత్రలోనే అరుదైన ఘటన. స్త్రీలు స్వయం శక్తిగా ఎదగాలని తపనపడిన ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహనరెడ్డి వారిని ఆర్ధికంగా, రాజకీయంగా, సాంఘికంగా ఉన్నములలుగా మారుస్తూంటే తట్టుకోలేని చంద్రబాబు నాయుడు వ్యవస్థలను అడ్డుపెట్టి అభివృద్ధికి, మహిళా అభ్యున్నతికి ఆటంకంగా మారారు. ఇలాంటి ఎన్ని కుయుక్తులు పన్నిన మహిళా సాధికారతకు ఏమాత్రం అడ్డుకోలేరు. డ్వాక్వా రుణాలు అందించినా, అమ్మ ఒడికి అంకురార్పణ చేసినా, వై.ఎస్.ఆర్ ఆసరా ఇచ్చిన మహిళలు కుటుంబ సభ్యులుగా సి.యమ్ వై.ఎస్.జగన్ ని అక్కున చేర్చుకున్నారు. రాష్ట్రంలో మహిళల సాధికారత వై.ఎస్.ఆర్.సి.పి తోనే సాధ్యం.