-నేడు చేపట్టిన ఇంటింటి సర్వేలో కొత్తగా కేసులు నమోదు కాలేదు
-కలెక్టర్ కీర్తి చేకూరి
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
కలుషిత పాలు కారణంగా వైద్య సహాయం అవసరమయ్యే రోగులకు అవసరమైన యాంటీడోస్ ఇంజెక్షన్ అందించడం కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. సీనియర్ నెఫ్రాలజిస్ట్ డా. రవి రాజు సూచనల ప్రకారం, రోగి ఆరోగ్య పరిస్థితిని బట్టి ఈ ఇంజెక్షన్ ఉపయోగించవచ్చు అని తెలియ చేశారు. రాష్ట్రంలో మరియు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇది అందుబాటులో లేకపోవడంతో, సంబంధిత ఏజెన్సీల ద్వారా ప్రత్యేకంగా తీసుకు రావడం జరుగుతున్నట్లు కలెక్టర్ వివరించారు.
ఇంటింటి పర్యవేక్షణ (House-to-House Surveillance) ఫలితాలు
జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో, ప్రభావిత ప్రాంతాలలో కలుషిత పాలు వినియోగించిన కుటుంబాల కోసం విస్తృత ఇంటింటి పర్యవేక్షణ కార్యక్రమం నిర్వహించబడిందన్నారు.
ఆర్ ఎమ్ సి కమిషనర్ రాహుల్ మీనా ప్రత్యక్ష పర్యవేక్షణలో 9 వైద్య బృందాలు పాల్గొని, మొత్తం 110 కుటుంబాలు, 307 మంది ప్రజలపై సమగ్ర విచారణ చేపట్టామన్నారు. లాక్ చేసిన ఇళ్లు: 6 (ఫోన్ ద్వారా సంప్రదించినప్పుడు ఎటువంటి లక్షణాలు లేవని గుర్తించబడింది). నేడు డోర్ టూ డోర్ సర్వే లో కొత్త కేసులు నమోదు కాలేదన్నారు. కుటుంబ సభ్యులకు పాలు మరియు పాల ఉత్పత్తులు వినియోగించకుండానే సురక్షితంగా పారవేయాలని సూచనలు చేశామన్నారు. భవిష్యత్తులో ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అవగాహన కల్పించి నట్లు తెలిపారు. ప్రస్తుత పరిస్థితి పూర్తిగా నియంత్రణలో ఉందని, జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ నిరంతరం పర్యవేక్షిస్తూ అవసరమైన చర్యలు తీసుకుంటోందని కలెక్టర్ తెలిపారు.
ఏవైనా ఆరోగ్య సమస్యలు గమనించినట్లయితే వెంటనే నిర్వహిస్తున్న మెడికల్ క్యాంప్ ను సంప్రదించమని లేదా ఫోన్ నెంబర్ “94940 60060” ద్వారా సమాచారం అందుకోవచ్చననీ తెలిపారు.
Prajavartha Online Telugu News