విజయవాడ పశ్చిమ నియోజకవర్గం పంజా సెంటర్ లో మిలాద్ ఉన్ నబీ వేడుకలు ఘనంగా జరిగాయి. ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి సేవా కార్యక్రమాలు చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ షేక్ ఆసిఫ్, 54వ డివిజన్ కార్పొరేటర్ అబ్దుల్ అర్షద్, వాజీద్ ఖాన్ తో పాటు ముస్లిం నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముందుగా రాష్ట్ర ప్రజలకు ముస్లిం సోదరులకు సోదరీమణులకు ఈద్ -మిలాద్ -ఉన్ -నబి శుభాకాంక్షలు తెలియచేసారు, మొహమ్మద్ ప్రవక్త జన్మదినాన్ని పురస్కరించుకుని పేదలకు అన్నదానం చేయడం ఎంతో అభినందనీయమని ఈ సందర్భంగా వారు తెలిపారు. మహ్మద్ ప్రవక్త బోధనలు ప్రపంచ మానవాళికి ప్రేమ, సోదరభావం, ధర్మంపై నమ్మకం కలిగించిందన్నారు. సర్వమానవాళి శ్రేయస్సు కోసం ప్రవక్త జీవితాన్ని అంకితం చేశారన్నారు. ఆ మహనీయుడు సూచించిన మార్గంలో నడుస్తూ.. సమాజ హితం కోసం ప్రతిఒక్కరూ పాటుపడినప్పుడే మహ్మద్ ప్రవక్త లక్ష్యం నెరవేరుతుందని పేర్కొన్నారు. కడప అమీన్ పీర్ దర్గా పీఠాధిపతుల శిష్య బృందం మరియు భక్తుల సారథ్యంలో జషన్-ఎ-ఈద్ -మిలాదున్నబీ…జగత్ ప్రవక్త మొహమ్మద్ ప్రవక్త వారి జన్మదిన వేడుకలు గత కొన్ని సంవత్సరాలుగా నిర్వహించటం జరుగుతుంది. అదే విధంగా ఈ సంవత్సరం కూడా వేడుకలు ఘనంగా నిర్వహించటం జరిగింది. ప్రజలకు అన్నప్రసాదం పంపిణి కార్యక్రమము జరిగింది. ఈ కార్యక్రమంలో ప్లవర్ డెకరేషన్ అధినేత షేక్ ఖాజా, ఇదారా ఏ అమీనియా చిష్టియా షాక్ అభిమానులు, శిష్యులు, భక్త బృందం తదితరులు పాల్గొన్నారు.
జషన్-ఎ-ఈద్ -మిలాదున్నబీ…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :