Breaking News

కిడ్నీలో రాళ్ల సమస్యకు కామినేనిలో అత్యాధునిక చికిత్స…


-నవ్యాంధ్రలో తొలిసారిగా తులియం లేజర్ లిథోట్రిప్సీ పరిజ్ఞానం
-కోతలు, కుట్లు లేకుండా ఆధునిక పద్దతిలో లేజర్ చికిత్సలు
-కామినేనిలో అడ్వాన్స్డ్ నెఫ్రాలజీ, యురాలజీ విభాగాలు
-మూత్రపిండాల సంరక్షణపై బ్రోచర్ ఆవిష్కరణ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కిడ్నీలో రాళ్ల సమస్యకు కామినేని హాస్పిటల్ నందు అత్యాధునిక చికిత్సలు అందుబాటులో ఉన్నాయని హాస్పిటల్ సీవోవో డాక్టర్ వెనిగళ్ల నవీన్ కుమార్ అన్నారు. నగరంలోని ఇంద్రప్రస్థ హోటల్ నందు మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కిడ్నీలో రాళ్ల సమస్యను పరిష్కరించేందుకు నవ్యాంధ్రలో తొలిసారిగా తులియం లేజర్ లిథోట్రిప్సీ సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తెచ్చామని తెలిపారు. ఈ ఆధునిక సాంకేతికత వ్యవస్థ ద్వారా ఎటువంటి కోత, కుట్లు లేకుండా లేజర్ చికిత్సలను అందించవచ్చని వివరించారు. అత్యంత అనుభవజ్ఞులైన వైద్య నిపుణుల ఆధ్వర్యంలో కామినేని నెఫ్రీలాజీ, యురాలజీ విభాగాలు నిర్వహించబడుతున్నాయని, అంతర్జాతీయ స్థాయి సదుపాయాలతో కూడిన ఈ ప్రత్యేక విభాగాల ద్వారా ఎప్పటికప్పుడు అత్యాధునిక చికిత్సలను అందుబాటులోకి తెస్తున్నామని డాక్టర్ నవీన్ కుమార్ పేర్కొన్నారు. అనంతరం కామినేని చెందిన ప్రముఖ నెఫ్రాలజిస్టు డాక్టర్ ఎస్.సరిత మాట్లాడుతూ మూత్రపిండాలకు సంబంధించిన అన్ని రకాల సమస్యలకు చికిత్సలను అందిస్తున్నామని తెలిపారు. షుగర్, బీపీ కారణంగా తలెత్తే సమస్యలు, యూరిన్ ఇన్ఫెక్షన్, కిడ్నీ ఇన్ఫెక్షన్లకు చికిత్సలు, క్రిటికల్ కేర్ నెఫ్రాలజీ సేవలు, విషం తీసుకున్న వారికి, షాక్ లో ఉన్న వారికి చికిత్సలు, హీమో ఫెర్గ్యుసర్ చికిత్స, కిడ్నీ ఫెయిల్యూర్, క్రానిక్ కిడ్నీ డీసీజ్, పిల్లలు, పెద్దల్లో ఉబ్బుకామెర్లకు చికిత్సలు, కిడ్నీ బయాప్సీ, 24 గంటల డయాలసిస్ సదుపాయాలతో పాటు కిడ్నీ మార్పిడి చికిత్సలు అందుబాటులో ఉన్నాయని అన్నారు. ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, క్రమబద్ధమైన జీవిన విధానాలను అవలంభించడం ద్వారా కిడ్నీ సమస్యల బారినపడకుండా ఉండొచ్చని డాక్టర్ సరిత తెలిపారు. ప్రముఖ యురాలజిస్టు డాక్టర్ పి.సంపత్ కుమార్ మాట్లాడుతూ కామినేని అడ్వాన్స్డ్ యురాలజీ యూనిట్ ద్వారా రోగులకు నాణ్యమైన సేవలందిస్తున్నామని అన్నారు. కిడ్నీలో రాళ్లకు ఆపరేషన్లు, ప్రోస్టేట్ గ్రంథి ఆపరేషన్లు, కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలు, కిడ్నీ, బ్లాడర్, ప్రోస్టేట్ చికిత్సలు, మూత్ర సంబంధ సమస్యలకు చికిత్సలు, క్యాన్సర్ చికిత్సలు, మగవారిలో సంతానలేమి, సెక్స్ సమస్యలకు చికిత్సలు అందుబాటులో ఉన్నాయని వివరించారు. కిడ్నీలో రాళ్ల సమస్యకు కామినేనిలో అందుబాటులోకి వచ్చిన అత్యాధునిక తులియం లేజర్ లిథోట్రిప్సీ సదుపాయాన్ని అవసరమైన వారు సద్వినియోగం చేసుకోవాలని డాక్టర్ సంపత్ కుమార్ సూచించారు. సమావేశంలో భాగంగా మూత్రపిండాల సంరక్షణకు సంబంధించిన సమగ్ర సమాచారంతో కూడిన ప్రత్యేక బ్రోచరును ఆవిష్కరించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మట్టి వినాయక విగ్రహాలనే ప్రతిష్ఠిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుదాం : మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పిలుపు

-భక్తితో పాటు బాధ్యతగా వినాయక చవితి జరుపుకుందాం. -వినాయక పందిళ్లకు ఉచిత విద్యుత్తుపై మంత్రి హర్షం అమరావతి, నేటి పత్రిక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *