-ఉగాది పురస్కార మహోత్సవంలో ఎంపీ పురందేశ్వరి
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రకృతితో ముడిపడిన పండుగ ఉగాది అని ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు. కాలం ఒక ప్రవాహం లాంటిది, గడిచిన, రాబోయే కాలం ఎలా ఉండబోతుంది అన్నది ఉగాది పంచాంగం అందిస్తుందన్నారు. తెలుగు క్యాలెండర్ మారడమే కాకుండా ప్రకృతి పురి విప్పి నాట్యమాడుతూ, కొత్త చిగురుతో ఆహ్వానం పలికేది ఉగాది అని ఆమె పేర్కొన్నారు. శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది పురస్కార మహోత్సవం స్థానిక జెకె గార్డెన్స్ లో ఎంపీ పురందేశ్వరి ఆధ్వర్యంలో గురువారం ఘనంగా జరిగింది. ఆత్మీయ వాతావరణంలో సందడిగా సాగిన ఈ వేడుకలో కవిపండితులకు, కళాకారులకు సత్కారం చేసారు. ఈసందర్బంగా ఎంపీ పురందేశ్వరి మాట్లాడుతూ అందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేసారు. ఈ కొత్త సంవత్సరం అందరికీ సుఖ సంతోషాలు కలిగించాలని ఆకాంక్షించారు. పరాభవ నామ సంవత్సరం అంటే ఓటమి అనే భావనతో చాలా మంది ఆందోళన చెందుతారని, అయితే దుర్గుణాలకు, దురాచారాలకు పరాభవంగా, మంచికి విజయంగా భావించాలన్నది నిగూడ అర్ధం అని ఆమె విశ్లేషించారు.
ఉగాది పచ్చడి అంటే షడ్రుచుల సమ్మేళనమని ఎంపీ పురందేశ్వరి తెలిపారు. చేదు స్వీకరిస్తేనే, వెంటనే తీపి వస్తుందని గుర్తించాలని అన్నారు. పంచాంగం మన జీవన శైలిలో అంతర్భాగమని, రాశుల గమనంతో పాటు మన గమనం ఎలా ఉండబోతుంది అన్నది పంచాంగ శ్రవణం ద్వారా తెలుసుకుని తద్వారా నడుచుకోవడానికి వీలవుతుందని ఎంపీ పురందేశ్వరి అన్నారు.
తొలుత విజయశంకర ప్రభుత్వ సంగీత నృత్య పాఠశాల ప్రిన్సిపల్ పసుమర్తి శ్రీనివాస శర్మ శిష్యబృందం నృత్య ప్రదర్శనతో అలరించారు. జ్యోతి ప్రజ్వలన అనంతరం పుల్లెల సత్యనారాయణ పంచాంగ శ్రవణం చేసారు. ఎంపీ పురందేశ్వరి, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, ఎమ్మెల్యేలు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, మద్దిపాటి వెంకట్రాజు, టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్ని కృష్ణ, రుడా చైర్మన్ బొడ్డు వెంకట రమణ చౌదరి, జిల్లా బిజెపి అధ్యక్షుడు పీక్కి నాగేంద్ర, బత్తుల వెంకట లక్ష్మి, ఓలేటి సత్యనారాయణ, తదితరుల చేతులమీదుగా మహామహోపాధ్యాయ విశ్వనాథ గోపాలకృష్ణ శాస్త్రి, తెలుగు వెలుగు అరిపిరాల నారాయణరావు, మహామహోపాధ్యాయ దోర్బల ప్రభాకర శర్మ , సిహెచ్. కూర్మయ్య, తలారి వాసు, జిత్ మోహన్ మిత్ర, గూటం స్వామి, చాగంటి మాలతి, శ్రీపాద సీతామహాలక్ష్మీ, గొడవర్తి రమాదేవి, సీనియర్ జర్నలిస్ట్ సత్య తదితరులను సత్కరించారు. అనంతరం ఎంపీ పురందేశ్వరిని మహిళా బృందం ఘనంగా సత్కరించింది.
ఈకార్యక్రమంలో కూటమి నాయకులు బొమ్ముల దత్తు, యర్రా వేణుగోపాలరాయుడు, పైడికొండల మాణిక్యాల రావు, నీరుకొండ వీరన్న చౌదరి, అడబాల రామకృష్ణ, క్షత్రియ బాలసుబ్రహ్మణ్యం సింగ్, నర్శిపల్లి హారిక, వాడ్రేవు అలివేలు, లక్ష్మీనారాయణ జవ్వార్
మద్దిపాటి రజని, వీరా వీరాంజనేయులు, యానాపు ఏసు, కాలెపు సత్య సాయిరాం, తగరం సురేష్, పడాల నాగరాజు, శ్రీవిద్య, పన్నాల లక్ష్మి సంతోషి, కొత్తపల్లి గీత, శెట్టిపల్లి శివనాగరాజు, మరుకుర్తి నరేష్ యాదవ్, రవిశంకర్, కొల్లాపు శీను, రాము ,అధికారుల లక్ష్మి, మీనాక్షి రెడ్డి ,రామారావు, అడపా వరప్రసాద్ ,కందుకూరి రమేష్ ,డాక్టర్ ఉమా, ఈశ్వర్, పెద్ద ఎత్తున కార్యకర్తలు కూటమి నాయకులు పార్లమెంట్ పరిధిలో ఉన్న పెద్దలు, యువకులు, మహిళలు ,పెద్ద ఎత్తున పాల్గొన్నారు తదితరులు ,
Prajavartha Online Telugu News