Breaking News

పేద కుటుంబానికి సీఎం అండగా నిలిచిన ఘటన

-సనమండ్ర పోసిబాబు కుటుంబంలో నూతన వెలుగులు
-ఉగాది రోజున ఆనందంలో పోసిబాబు కుటుంబం

తాళ్లపూడి / రాజమహేంద్రవరం , నేటి పత్రిక ప్రజావార్త :
సాధారణ కుటుంబానికి చెందిన ఒక సామాన్యుడి జీవితంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చూపిన ఔదార్యం మానవత్వం ఎలా మార్పు తీసుకువచ్చిందనే దానికి సనమండ్ర పోసిబాబు కుటుంబం సజీవ ఉదాహరణగా నిలిచిన ఘటన తూర్పు గోదావరి జిల్లాలో ఆవిష్కృతం అయింది.

రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలు అమలుకావడంతో పోసిబాబు కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. కష్టాల్లో ఉన్న తమ కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలవడం పట్ల వారు కృతజ్ఞతలు తెలిపారు. గతంలో జిల్లా కలెక్టర్‌గా పనిచేసిన పి. ప్రశాంతి తమ కుటుంబాన్ని దత్తత తీసుకుని ఆదుకున్నారని పోసిబాబు కుటుంబ సభ్యులు గుర్తుచేసుకున్నారు. ఆ సమయంలో ప్రారంభమైన సహాయం ప్రస్తుతం కూడా కొనసాగుతుండటంతో తమ జీవన పరిస్థితుల్లో గణనీయమైన మార్పు వచ్చిందని వారు తెలిపారు.

కలెక్టర్ కీర్తి చేకూరి ఇచ్చిన హామీ మేరకు దత్తత తీసుకున్న లబ్ధిదారుడి అసంపూర్తి గృహ నిర్మాణ పనులు పూర్తి చేయించబడినట్లు హౌసింగ్ పీడీ నాతి బుజ్జి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. పిట్టగోడలు, మెట్ల సైడ్‌వాల్, ప్లాస్టరింగ్, కప్‌బోర్డులు, టైల్స్, పెయింటింగ్, టాయిలెట్ నిర్మాణం, ఫెన్సింగ్, స్థల మెరక వంటి పనులు పూర్తయ్యాయన్నారు. ప్రభుత్వం హౌసింగ్ బిల్లులకు అతీతంగా సుమారు రూ.2.50 లక్షల వ్యయంతో ఈ పనులు నిర్వహించామన్నారు. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా జీవనోపాధి కోసం రూ.1 లక్ష ఆర్థిక సహాయం అందించినట్లు తెలిపారు. గృహా నిర్మాణం నుంచి అన్ని విధాలుగా పోసి బాబు కుటుంబానికి అండగా జిల్లా యంత్రాంగం నిలిచిందని, హౌసింగ్, డ్వామా, మైన్స్, ఎస్సీ కార్పొరేషన్ శాఖలు సమన్వయంతో పని చేయడం జరిగిందని నాతి బుజ్జి తెలిపారు. దత్తత అనంతరం మొత్తం రూ.3.50 లక్షల విలువైన పనులు పూర్తి చేసి ఉగాది పర్వదినానికి లబ్ధిదారుడికి అందజేసినట్లు ఆమె తెలిపారు.

పొసిబాబు మాటల్లో ఘటన వివరాలు ఇలా ఉన్నాయి:
“2025 జూలై ఒకటవ తేదీన తాళ్లపూడి మండలం మలకపల్లి గ్రామానికి సామాజిక భద్రత ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమానికి ముఖ్యమంత్రి గారు విచ్చేశారు. ఆ సమయంలో నాకు పెన్షన్ అందించడానికి అధికారులు పిలిచారు. అయితే నేను అప్పటికే సమీపంలోని కిరాణా దుకాణానికి వెళ్లాను. విషయం తెలుసుకున్న ముఖ్యమంత్రి గారు స్వయంగా తన కాన్వాయ్ వాహనాన్ని ఆపించి నన్ను పిలిపించి, తన వాహనంలో ఎక్కించుకుని నా ఇంటి వద్ద దించారు. నా లాంటి డప్పు కళాకారుడు, చర్మకారుడిని గౌరవంగా ఇంటివద్ద దించడం “నాకు జీవితాంతం మరిచిపోలేని సంఘటన.”

“నా ఇంటి పరిస్థితిని ప్రత్యక్షంగా చూసిన ముఖ్యమంత్రి ఇంటి పునర్నిర్మాణం చేయాలని, స్వయం ఉపాధి కల్పించాలని అధికారులను ఆదేశించారు. నా జీవనోపాధి కోసం చెప్పుల దుకాణం ఏర్పాటు చేయాలని సూచించారు. నా ఇంటి దుస్థితి చూసి వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పడం నాకు ఎంతో ధైర్యం ఇచ్చింది” అని పోసిబాబు తెలిపారు.

ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు అప్పటి కలెక్టర్ ప్రశాంతి గారు, ప్రస్తుతం జిల్లా కలెక్టర్ కలెక్టర్ కీర్తి చేకూరి తమ స్థాయిలో స్పందించి ఇంటి మరమ్మతులు చేపట్టించారు. ఇంటిలో టైల్స్ వేయించడం, గోడలకు ప్లాస్టరింగ్ చేయించడం, ఇంటి చుట్టూ ఫెన్సింగ్, మెరక పనులు, మరుగుదొడ్లు నిర్మాణం వంటి మౌలిక సదుపాయాలు కల్పించారు. అదేవిధంగా స్వయం ఉపాధి కోసం చెప్పుల దుకాణం ఏర్పాటు దిశగా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

కొవ్వూరు శాసన సభ్యులు ముప్పిడి వెంకటేశ్వరరావు కూడా కుటుంబానికి అండగా నిలిచి అధికారులకు అవసరమైన సూచనలు ఎప్పటి కప్పుడు అందించారు. హౌసింగ్ శాఖ ఇతర శాఖల అధికారులు, ఇతర సిబ్బంది కూడా అన్ని విధాలుగా తనకు సహకరించారని పోసిబాబు తెలిపారు.

“నాకు ఇది కొత్త జీవితం లాంటిది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కి, జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి మేడం కి, గతంలో ఇక్కడ పనిచేసిన కలెక్టర్ ప్రశాంతి మేడం కి, హౌసింగ్ పీడీకి, నన్ను ఆదుకున్న ప్రతి అధికారికి పేరు పేరునా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మా కుటుంబానికి ఇది మరపురాని సహాయం” అని పోసిబాబు ఆనందం వ్యక్తం చేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

శ్రీ కృష్ణాష్టమి వేడుకలలో దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఈ రోజు శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా తూర్పు నియోజకవర్గంలో వైస్సార్ కాంగ్రెస్ పార్టీ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *