విజయవాడ/ పెనమలూరు, నేటి పత్రిక ప్రజావార్త :
పెనమలూరు మండలం గంగూరు 1,2 గ్రామ సచివాలయాలను శుక్రవారం విజయవాడ సబ్ కలెక్టర్ జి. సూర్యసాయి ప్రవీణ్‌చంద్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సచివాలయం ద్వారా పౌరులకు అందించే సేవలు విసృత్తం చేయాలన్నారు. వార్డు సచివాలయ ద్వారా ప్రజలకు అందించిన వివిధ సర్వీసుల వివరాలపై సచివాలయ సిబ్బందిని వాకబు చేశారు. వార్డు సచివాలయ ద్వారా అందించే సేవలు వేగవంతం కావాలన్నారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించాలన్నదే సచివాలయాల ఏర్పాటు ముఖ్య ఉద్ధేశం అన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాల వివరాలు తెలిపే బోర్డులను, అర్హుల జాబితాలను, క్రమపద్దతిలో సచివాలయంలో ప్రదర్శించాలన్నారు. వీరి వెంట తహాశీల్థార్ బద్రునాయక్ యంపిడివో విమా తదితరులు ఉన్నారు.
Tags vijayawada
Check Also
దాడి పూర్ణిమను ఆశీర్వదించిన ఎమ్మెల్యే సుజనా చౌదరి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : స్టాండింగ్ కమిటీ మాజీ చైర్మన్ దాడి అప్పారావు మనవరాలు, తెలుగు యువత నాయకులు …