-నగరంలో అవార్డుల ప్రధానోత్సవ ట్రయల్ రన్ పరిశీలన
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వ ప్రదానం చేయనున్న వైఎస్సార్ జీవిత సాఫల్య వైఎస్సార్ సాఫల్య పురస్కారాల ప్రదానోత్సవం కార్యక్రమ ట్రయల్ రన్‌ను శుక్రవారం నిర్వహించారు. నగరంలోని ఏ1 కన్వెన్షన్ హాలు నందు శుక్రవారం రాత్రి అవార్డుల ప్రధానోత్సవ ఏర్పాట్లను, ట్రయల్ రన్ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి కార్యక్రమాల సమన్వయకర్త తలశిల రఘురాం, ముఖ్యమంత్రి కార్యదర్శి రేవు ముత్యాలరాజు, జిల్లా కలెక్టర్ జె. నివాస్, నగర పోలీస్ కమిషనర్ బత్తిన శ్రీనివాసులు, ఏయండిఏ కమిషనర్ విజయ్‌కృష్ణన్, ప్రోటోకాల్ డైరెక్టర్ యం. సుబ్రహ్మణ్యరెడ్డి, జాయింట్ కలెక్టర్ (సంక్షేమం) కె. మోహన్‌కుమార్, విజయవాడ సబ్ కలెక్టర్ జి. సూర్యసాయి ప్రవీణ్‌చంద్ ఆర్‌డివో ఖాజవలి, వియంసి అదనపు కమిషనర్ అరుణ, తదితరులు పరిశీలించారు. అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమానికి సంబంధించి అవార్డుగ్రహితలను వారి వారికి కేటాయించిన స్థానాల్లో ఆశీనులు చేయడం దగ్గర నుంచి కార్యక్రమం చివరి వరకు ప్రతీ అంశాంలో పాటించవల్సిన అంశాల వారిగా ట్రయల్‌రన్‌లో నిర్వహించారు. కార్యక్రమం ప్రారంభం నుంచి పూర్తి అయ్యే వరకు ఒక క్రమ పద్దతిలో అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమం నిర్వహణకు అవసరమైన అన్ని చర్యలను తీసుకున్నారు.