Breaking News

యువత ఐక్యత తో నడిస్తే భారతదేశం అభివృద్ధి సాధ్యం…


-బి.జె ప్రసన్న, నెహ్రూ యువ కేంద్ర సంఘటన్ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర సంచాలకులు

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
భారత ప్రభుత్వం కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ, నెహ్రు యువ కేంద్ర గుంటూరు ఆధ్వర్యములో ప్రధాన మంత్రి  ప్రారంబించిన ఆజాది క అమృత్ మహోత్సవ్ 75 సంవత్సరాల స్వాతంత్య్ర ఉత్సవాలు సందర్భముగా క్లీన్ ఇండియా ముగింపు మరియు సర్దార్ పటేల్ జయంతోత్సవాల కార్యక్రమాన్ని నెహ్రూ యువ కేంద్ర, గుంటూరు కార్యాలయములో గుంటూరు లో నిర్వహించారు. నెహ్రూ యువ కేంద్ర సంఘటన్ ఉప సంచాలకులు శ్రీమతి ఏ ఆర్ విజయరావు అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమం లో ముఖ్య అతిధి గా విచ్చేసిన బి.జె ప్రసన్న మాట్లాడుతూ సర్దార్ పటేల్ ఎల్లప్పుడూ భారతదేశం సమర్థంగా, అందరినీ కలుపుకొని, సున్నితత్వంతో, అప్రమత్తంగా, వినయంగా మరియు అభివృద్ధి చెందాలని కోరుకున్నారు. అతను ఎల్లప్పుడూ జాతీయ ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇచ్చారు అన్న ప్రధాని గౌరవనీయులైన నరేంద్ర మోడీ గారి మాటలను గుర్తు చేశారు. అలాగే “క్లీన్ ఇండియా సేఫ్ ఇండియా” అనే నినాదంతో 01 అక్టోబర్ నుండి ఈ రోజు వరకు దెస వ్యాప్తముగా జరిగిన సింగల్ యూజ్ ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించేందుకు జరిగిన క్లీన్ ఇండియా కార్యక్రమము విజయవంతమవడము అందరికి గర్వకారణమని, ఇందులో భాగస్వామ్యులైన మరియు ఇందుకు సహకరించిన యువజన సంఘాలు, స్వచ్చంద సేవాసంస్థలు, ఎన్ ఎస్ ఎస్, ఎన్ సి సి, వాలంటీర్లు, ఆశ మరియు అంగన్వాడీ కార్యకర్తలు, రాష్ట్ర, జిల్లా గ్రామీణ మునిసిపాలిటీ నగరపాలక సంస్థ అధికారులు, పంచాయత్ రాజ్ అధికారులు సర్పంచులు ఎంపిటిసి జడ్పీటీసీ లు, ప్రత్యేక శ్రద్ధ తీసుకొని నిరంతరం కార్యక్రమాన్ని విజయవంతం చేయటానికి వివిధ శాఖలతో సమన్వయము చేసిన కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, జడ్పీ సీఈఓ లు యువజన సర్వీసుల శాఖ వారికి ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా వారికి కూడా ధన్యవాదాలు తెలియ చేస్తున్నామన్నారు. అలాగే గత రెండు సంవత్సరాలుగా ప్రపంచవ్యాప్తముగా ప్రజలందరినీ వణికిస్తున్న కరోనా ఇప్పుడు ౩వ దశ లోకి వచ్చి భారదేశాన్ని కూడా తాకింది అని, ఈ పరిస్థితులలో ఎన్నో దేశాలు లాక్ డౌన్ ప్రకటిస్తున్నాయి అని అన్నారు. ప్రజలు అందరు స్వీయ లాక్ డౌన్ చేసుకుని, జీవ భద్రత చర్యలను నిర్వహించడం, అత్యవసరమైతే తప్ప బయటకువెళ్లకుండా ఉండటం, మాస్క్‌లు ధరించడం, సామాజిక దూరం పాటించడం, వాక్సినేషన్ తప్పనిసరిగా వేయుంచుకోవడము, తరచుగా చేతులు కడుక్కోవడం మొదలైనవి పాటించాలి అన్నారు. ముందుగా సర్దార్ పటేల్ చిత్ర పటానికి పూలమాలవేసి, నివాళులు అర్పించిన అనంతరం ముఖ్యఅతిథి చేతుల మీదుగా జలశక్తి అభియాన్ లో భాగమైన క్యాచ్ ది రైన్ ఫేస్ 2 ను గోడ పత్రికలతో ప్రారంభించారు తదనంతరం నెహ్రు యువ కేంద్ర కార్యాలయం నుంచి రోడ్ల మీద చెత్త మరియు ప్లాస్టిక్ సేకరిస్తూ నినాదాలతో క్లీన్ ఇండియా ర్యాలీ ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అతిధులుగా నెహ్రు యువ కేంద్ర గుంటూరు జిల్లా యువ అధికారి కిరణ్మయి దేవిరెడ్డి, ఏ పూర్ణిమ, ఎన్ ఎస్ ఎస్ ఆఫీసర్ , ఆచార్య ఎన్ జి రంగ అగ్రికల్చరల్ యూనివర్సిటీ,  వై సమీర్ , సెక్రటరీ & కరెస్పాండంట్ , వై పి డి నర్సింగ్ & పారామెడికల్, ఆచార్య ఎన్ జి రంగ అగ్రికల్చరల్ యూనివర్సిటీ హోమ్ సైన్సెస్ కాలేజీ నుంచి ఎన్ ఎస్ ఎస్ కార్యకర్తలు మరియు నెహ్రూ యువ కేంద్ర వాలంటీర్లు పాల్గొన్నారు.

Check Also

ఏపీలో సినీ పరిశ్రమను ప్రోత్సహిస్తాం

-చిత్ర పరిశ్రమ కోసం కొత్త ఫిల్మ్ పాలసీని తీసుకొస్తాం -గేమ్ ఛేంజర్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో వెల్లడించిన రాష్ట్ర …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *