కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త :
దీపావళి షాపుల నిర్వహికులు అగ్నిప్రమాదం జరగకుండా అత్యంత జాగ్రత్తగా వ్యవహరిచాలని కొవ్వూరు ఆర్డీవో ఎస్. మల్లిబాబు పేర్కొన్నారు. బుధవారం స్థానిక సంస్కృత కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన బాణసంచా షాపు లను డిఎస్పీ తో కలిసి ఆకస్మాత్తుగా తనిఖీ చేశారు. ఆర్డీవో మల్లిబాబు మాట్లాడుతూ, దీపావళి పండుగను పురస్కరించుకుని కాలుష్య రహితమైన పర్యావరణానికి చెడు కలుగ చెయ్యానటువంటి దీపావళి సామగ్రి, టపాసులు అమ్ముకునేందుకు అనుమతులు మంజూరు చెయ్యడం జరిగిందన్నారు. ఈ దీపావళి మీ ఇంట ఆనందాన్ని చేకూరాలన్నీ శుభాకాంక్షలు తెలిపారు. దీపావళి సామగ్రి అమ్మే షాపుకి షాపుకి మధ్య కనీసం 10 మీటర్లు దూరం ఉండేలా చూడాలన్నారు. అగ్నిప్రమాదం నివారించే అగ్నిమాపక సేఫ్టీ పరికరాలు , 200 లీటర్లు నీటితో కూడిన రెండు డ్రమ్ములు, రెండు ఇసుక , రెండు నీటితో కూడిన బకెట్ లు, ఫస్ట్ ఎయిడ్ బాక్స్ లను పరిశీలించారు. ఆయా ప్రాంతాలను నో స్మోక్కింగ్ జోన్ లుగా పరిగణించుట జరిగిందని ఆర్డీవో , ఎటువంటి అగ్ని ప్రమాదాలకు తావిచ్చే వస్తువుల ను ప్రాంగణంలో కి రాకుండా చూడాలన్నారు. అమ్మకాలు జరిగే సమయంలో కోవిడ్ మార్గదర్శకాలు పాటించాలని, మాస్కు ధరించని వారికి దీపావళి టపాసులు విక్రయించద్దని సూచించారు. అమ్మకాలు, కొనుగోళ్లు సమయంలో ఖచ్చితంగా భౌతిక దూరం పాటిస్తూ కనీసం వ్యక్తి కి వ్యక్తి కి మధ్య ఆరడుగుల దూరం, మాస్కు ధరించడం తప్పనిసరి అన్నారు. కొవ్వూరు లో 15 షాపులను లైసెన్స్ మంజురు చేసినట్లు తెలిపారు. ప్రభుత్వ మార్గదర్శకాలు పాటించని వారిపై , ఉల్లంఘన కి పాల్పడిన వారిపై కేసులు నమోదు చేస్తామని డిఎస్పీ బి. శ్రీధర్ పేర్కొన్నారు. రెవెన్యూ, పోలీస్, అగ్నిమాపక శాఖ ద్వారా అనుమతి పొందిన వారే షాపులు నిర్వహించాలని సంబంధించిన అనుమతి పత్రాలను మీ వద్ద షాపు లో ఉంచుకుని తనిఖీ అధికారులకు చూపించాలన్నారు. వాహనాలు కోసం సరిపడే పార్కింగ్ స్థలం పరిశీలించర్జ్డ దీపావళి వ్యాపారం కోసం అనుమతి తీసుకున్న వ్యక్తులు వాణిజ్య పన్నుల శాఖ అధికారుల వద్ద వారి వ్యాపార లావాదేవీల వివరాలు నమోదు చేసుకోవాలని సూచించారు. తహసిల్దార్ బి. నాగరాజు నాయక్, సి ఐ సునీల్ కుమార్ తదితరులు ఉన్నారు.
Tags kovvuru
Check Also
ప్రధాని మోదీ ప్రపంచం మెచ్చిన నాయకుడు
-అభివృద్ధి, సంక్షేమం, సంస్కరణలు, సుపరిపాలన మోదీ నినాదాలు -ఒకేరోజున రూ.2,08,548 కోట్ల పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు ఒక రికార్డ్ -ఇంతటి …