Breaking News

కృష్ణా గోదావరి అధ్యక్ష ఖండం ఎన్నికల సంఘ సభ్యుల న్యాయ పోరాటం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సిఎస్ఐ చర్చ్ ప్రధమ సంఘమైన దక్షిణ ఇండియా సంఘంలో సంబంధం లేని వ్యక్తులను ఓటరు జాబితాలో చేర్చి 2026 – 27 ఎన్నికలు నిర్వహించడానికి ఖండిస్తూ హైకోర్టు ఇచ్చిన స్టే ఆర్డరును ఉల్లంగించడాన్ని నిరసిస్తూ విజయవాడ ప్రెస్ క్లబ్ లో శుక్రవారం సంఘ సభ్యులు ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో సంఘ సభ్యులు మాట్లాడుతూ కృష్ణా గోదావరి అధ్యక్ష ఖండం ఎన్నికల సంఘ సభ్యుల ద్వారా కొన్ని విషయములు తెలియజేశారు. కృష్ణా గోదావరి అధ్యక్ష ఖండము గుంటూరు నుండి శ్రీకాకుళం వరకు సుమారు పది జిల్లాల్లో విస్తరించి ఉన్నది ఐదు లక్షల మంది మెంబర్స్ దీనిలో ఉన్నారు. అయితే ప్రతి మూడు సంవత్సరములకు ఎలక్షన్ జరుగుతుంది. ఆ ఎలక్షన్ లో సెక్రటరీ ట్రెజరరు మరియు ఎగ్జిక్యూటివ్ కమిటీని ఎన్నుకుంటారు. అయితే 39వ సమాలోచన సభలో సుమారు 42 మంది పాస్టర్లను కౌన్సిల్ నుంచి తీసివేసి ఒక దొంగ కౌన్సిల్ ను జరిపించాలని బిషప్  జార్జ్ కొర్నేలియస్ మరియు వారి తమ్ముడు తంటెపూడి రవికుమార్ అలాగే పండు జగదీష్ మరియు వారి మిత్రబృందం ఈ సమాలోచన సభలో అధ్యక్ష ఖండానికి సంబంధము లేని సుమారు 200 దొంగ ఓటర్లను కలిపి ఎలక్షన్ నిర్వహించాలని ఆలోచన చేశారు. అయితే నేను సినాడు కౌన్సిల్ మెంబర్ గా ఉండి దీని కొరకు పోరాడుతూ హైకోర్టులో సి ఆర్ పి నెంబర్ 886/2026 వ్యాద్యము వెయ్యడం అయినది. ఆ కేసులో ఈరోజు హైకోర్టు వారు 27 జూన్ 2026 న జరగాల్సిన అధ్యక్ష ఖండ సమాలోచన సభ మీద స్టే విధించడం అయినది. ఇది ఈ సమావేశం ద్వారా ప్రజలకు తెలియజేయుచున్నామన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

శ్రీ కృష్ణాష్టమి వేడుకలలో దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఈ రోజు శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా తూర్పు నియోజకవర్గంలో వైస్సార్ కాంగ్రెస్ పార్టీ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *