Breaking News

సైనిక్ స్కూల్ లో రెండవ బ్యాచ్ క్యాడేట్స్ క్లాసులు ప్రారంభo

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ సమీపంలోని కేతనకొండలో విద్యాభారతి ఆధ్వర్యం లో నడపబడుతున్న ‘నేతాజీ సైనిక పాఠశాల’ విద్యార్థులను భావి భారత సైనిక అధికారు లుగా తీర్చిదిద్దుతోందని విద్యా భారతి దక్షిణం మధ్య క్షేత్ర సంఘటన కార్యదర్శి లింగం సుధాకర్ రెడ్డి, పాఠశాల అడ్వైజర్ డాక్టర్ సి ఎల్ వెంకట్రావులు వెల్లడిం చారు. పూర్తిస్థాయి గురుకుల పద్ధతిలో నడిచే ఈ స్కూల్‌లో విద్యార్థులను ఐపీఎస్, మిలిటరీ ఆఫీసర్లుగా తీర్చిదిద్దడమే లక్ష్యమని పేర్కొన్నారు. ఈ సంద ర్భంగా విజయవాడ సమీపంలో కేతన కొండ ల్లోని నేతాజీ సైనిక్ స్కూల్ లో రెండవ బ్యాచ్ క్యాడేట్స్ క్లాసులు ప్రారంభ కార్యక్రమం అత్యంత ఘనంగా జరిగింది. ఈ కార్యక్ర మానికి విద్యాభారతి దక్షిణ మధ్య క్షేత్ర సంఘటన కార్యదర్శి లింగం సుధాకర్ రెడ్డి, పాఠశాల అడ్వైజర్ డాక్టర్ సి ఎల్ వెంకటరావు, హెచ్ఆర్ తోండేపు గ్రూప్ చైర్మన్ తొండెపు హనుమంతరా వు, మాజీ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ డివి రమణ కుమార్, పొట్టి శ్రీరాములు ఇంజనీరింగ్ కాలేజీ అధ్యక్షులు చలువాది మల్లికార్జునరావు, ప్రముఖ వస్త్ర వ్యాపారి గోళ్ళ రామచంద్రరావు, ఎస్ ఎల్ వి గ్రూప్ చైర్మన్ పి శ్రీనివాసరాజు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విశ్రాంత ఆర్మీ అధికారి సి.వి.ఆర్. ప్రసాద్ దేశభక్తితో అందించిన ఎనిమిది ఎకరాల్లో పాఠశాల ఏర్పాటుఅయి రు. రక్షణ మంత్రిత్వ శాఖ అనుమతితో, సిబిఎస్‌ఈ (CBSE) సిలబస్‌తో ఇక్కడ 6 నుంచి 12వ తరగతి వరకు నాణ్యమైన విద్యను అందిస్తున్నారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) ప్రతియే టా నిర్వహించే అఖిల భారత ప్రవేశ పరీక్షలో మెరిట్ ఆధారంగా 6వ తరగతిలో ప్రవేశాలు కల్పిస్తారని చెప్పారు. కాగా, ఐదో తరగతి నుంచే ఇక్కడ చేరిన విద్యార్థులకు సైనిక పాఠశాల నిబంధనల ప్రకారం 6వ తరగతి ప్రవేశాల్లో ప్రత్యేక వెసులు బాటు ఉంటుందన్నారు. అక్టోబర్‌లో నోటిఫికేషన్ వెలువడనుండగా, జనవరిలో పరీక్ష జరుగుతుందని చెప్పారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఎన్.ఐ.డి. ప్రాంగణంలో 12వ జాతీయ చేనేత దినోత్సవ ముందస్తు వేడుకలు

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : అమరావతి సమీపంలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ (NID) ప్రాంగణంలో 12వ జాతీయ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *