విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
అట్టడుగు మరియు బలహీన వర్గాలకు రాజకీయ అధికారమే లక్ష్యంగా తమ భవిష్యత్తు కార్యచరణ ఉంటుందని బి.జి.ఆర్ నారగోని స్పష్టం చేశారు. వీరాంకి అయ్యన్నబాబు, బి.జి.ఆర్ నారగోని 70వ జన్మదిన వేడుకలను రాజకీయ న్యాయ సాధన దినంగా ఆయన అభివర్ణించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం అసెంబ్లీలో కేవలం రెండు సామాజిక వర్గాలే 70కి పైగా స్థానాలను ఆక్రమించి ప్రజాస్వామ్యాన్ని శాసిస్తున్నాయని నారగోని విమర్శించారు. దీనివల్ల బీసీ ముస్లిం వర్గాలకు దక్కాల్సిన రాజకీయ అవకాశాలను ఆ రెండు వర్గాలే కొల్లగొడుతున్నాయని ఆయన ఆరోపించారు. రాబోయే 2029 ఎన్నికల కోసం బలమైన వ్యూహాన్ని ఆయన ప్రకటించారు. “రెండు లక్షల ఓట్లున్న ప్రతి కులానికి ఒక ఎమ్మెల్యే టికెట్ ఐదు లక్షల ఓట్లున్న కులానికి ఒక ఎంపీ టికెట్” అనే నినాదంతో ముందుకు వెళ్తామని వెల్లడించారు. ఈ క్రమంలో రాజ్యాధికార పార్టీ బ్లూ ఇండియా పార్టీ, ప్రజాధికార పార్టీ వంటి సుమారు 8 పార్టీలను ఏకం చేసి ఒక బలమైన ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతామని ధీమా వ్యక్తం చేశారు. ఓబీసీ మహిళలకు మరియు బీసీలకు రాజకీయ రిజర్వేషన్ల సాధన కోసం ఆగస్టు మొదటి వారంలో ఢిల్లీలో భారీ ఆందోళనలు చేపట్టనున్నట్లు నారగోని ప్రకటించారు. అన్ని వర్గాలకు కులాలకు సరైన రాజ్యాధికారం లభించే వరకు తమ పోరాటం నిరంతరాయంగా కొనసాగుతుందని ఆయన పునరుద్ఘాటించారు. ఈ కార్యక్రమంలో రాజ్యాధికార పార్టీ మహిళ అధ్యక్షురాలు పొట్లూరి దేవి, బిసి ఐక్య సంఘర్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు ఆదిమూలం గురు స్వామి యాదవ్, రాజ్యాధికార పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News