Breaking News

ఏ ఈ ఆర్ వో లు, BLOల సమస్యలు తెలుసుకుని పరిష్కార మార్గాలపై దిశానిర్దేశం ఇవ్వాలి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర గురువారం సాయంత్రం లక్ష్మీ నగర్ కాలనీ , ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియం లో ఏర్పాటుచేసిన సెంట్రల్ నియోజకవర్గం కంట్రోల్ రూమ్ లో, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) కార్యక్రమం పురోగతిని క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

ఈ సందర్భంగా బూత్ లెవల్ ఆఫీసర్ల (BLOలు)తో నేరుగా మాట్లాడి, వారు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఎస్‌ఐఆర్ ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయడంలో ఎదురవుతున్న ఇబ్బందులు ఏమిటి, వాటికి పరిష్కార మార్గాలు ఏవి అనే అంశాలపై వారితో చర్చించి తగిన సూచనలు, సలహాలు అందించారు.

ప్రతి బూత్ లెవల్ ఆఫీసర్ సమర్థవంతంగా పనిచేస్తేనే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియను నిర్దేశిత గడువులోగా విజయవంతంగా పూర్తి చేయడం సాధ్యమవుతుందని కమిషనర్ పేర్కొన్నారు. ఏఈఆర్వోలు తమ పరిధిలోని BLOలతో నిరంతరం సమన్వయం చేసుకుంటూ, వారు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే గుర్తించి, అక్కడికక్కడే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రతి BLOకు అవసరమైన సహకారం అందిస్తూ, ఎస్‌ఐఆర్ ప్రక్రియను సమర్థవంతంగా, వేగవంతంగా పూర్తి చేసేలా పర్యవేక్షణ నిర్వహించాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో ఏర్పాటుచేసిన సెంట్రల్ నియోజకవర్గం కంట్రోల్ రూమ్ లో బూత్ లెవెల్ ఆఫీసర్లు ఎన్యుమరేషన్ ఫోరముల మ్యాపింగ్, డిజిటలైజేషన్ చేసే ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు

 

ఎస్‌ఐఆర్ కార్యక్రమంలో భాగంగా నగరంలోని మూడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ వేగంగా కొనసాగుతోందని కమిషనర్ ధ్యానచంద్ర తెలిపారు. గురువారం సాయంత్రం 4.00 గంటల నాటికి విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో 2,77,822 మంది ఓటర్లకు గాను 2,70,004 మందికి (97.19%) ఎన్యుమరేషన్ ఫారాలు పంపిణీ చేయగా, వాటిలో 63,894 ఫారాలు (23.00%) డిజిటైజేషన్ పూర్తయిందన్నారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో 2,56,980 మంది ఓటర్లకు గాను 2,51,087 మందికి (97.71%) ఫారాలు పంపిణీ చేసి, 53,503 ఫారాలు (20.82%) డిజిటైజేషన్ చేసినట్లు తెలిపారు. అలాగే విజయవాడ తూర్పు నియోజకవర్గంలో 2,69,734 మంది ఓటర్లకు గాను 2,63,563 మందికి (97.71%) ఫారాలు పంపిణీ చేయగా, 68,261 ఫారాలు (25.31%) డిజిటైజేషన్ పూర్తయిందన్నారు. మిగిలిన ఫారాల పంపిణీ, సేకరణ, డిజిటైజేషన్ ప్రక్రియలను ఎన్నికల సంఘం నిర్దేశించిన గడువులోగా పూర్తి చేయాలని AEROలు, BLOలు, BLO సూపర్వైజర్లకు కమిషనర్ ఆదేశించారు.

ఈ కార్యక్రమం లో చీఫ్ సిటీ ప్లానర్ మరియు ఏఈఆర్ఓ కె. సంజయ్ రత్నకుమార్, ఎలక్షన్ డి టీ యస్. సురేష్ కుమార్, సిడిఓ జగదీశ్వరి, బిఎల్వోలు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఎన్.ఐ.డి. ప్రాంగణంలో 12వ జాతీయ చేనేత దినోత్సవ ముందస్తు వేడుకలు

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : అమరావతి సమీపంలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ (NID) ప్రాంగణంలో 12వ జాతీయ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *