Breaking News

కేంద్ర మంత్రి కె. రామ్మోహన్ నాయుడుతో మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి భేటీ

-రాష్ట్రంలో ఏవియేషన్ రంగ అభివృద్ధి, కొత్త విమానాశ్రయాలు, సీప్లేన్ ప్రాజెక్టులు, ఏరోస్పేస్ పెట్టుబడులపై విస్తృత చర్చ

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రంలో రాబోయే 20 ఏళ్ల అవసరాలను దృష్టిలో ఉంచుకుని విమానాశ్రయాల నిర్మాణానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి మార్గనిర్దేశకత్వంలో రాష్ట్రంలోని ప్రతి 150 కిలోమీటర్ల పరిధిలో ఒక ఎయిర్ పోర్టు ఏర్పాటు చేయాలనే వ్యూహాత్మక లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని వివరించారు. నేడు ఢిల్లీలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె. రామ్మోహన్ నాయుడిని ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి కలిశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లో ఏవియేషన్ రంగ అభివృద్ధికి సంబంధించిన కార్యాచరణ ప్రణాళిక, రూట్ మ్యాప్, పెండింగ్‌లో ఉన్న అనుమతులు తదితర అంశాలపై సమగ్రంగా చర్చించారు.

రాష్ట్రంలో ఏవియేషన్ రంగ పురోగతిని వేగవంతం చేయడంతో పాటు, కొత్త విమానాశ్రయాలకు అవసరమైన కేంద్ర అనుమతుల మంజూరు, ప్రాంతీయ మరియు అంతర్ రాష్ట్ర విమాన సర్వీసుల విస్తరణకు చేపట్టాల్సిన వ్యూహాత్మక చర్యలు, ఫ్లైట్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్ (FTO) క్లస్టర్ అభివృద్ధి ద్వారా ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పన, పెట్టుబడుల ఆకర్షణ వంటి అంశాలను ఇరు మంత్రులు సమీక్షించారు.

పుట్టపర్తి సమీపంలో ఏరోనాటికల్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ (ADA) ఫ్లైట్ టెస్టింగ్ కార్యకలాపాల కోసం ప్రత్యేక ఎయిర్‌స్పేస్ ఏర్పాటు చేయడం, వాటి నియంత్రణ ప్రక్రియకు సంబంధించిన మార్గదర్శకాల రూపకల్పన, అవసరమైన ఆమోదాలపై కూడా మంత్రులు చర్చించారు.

రాష్ట్రంలోని నదులు, జలాశయాల్లో ప్రతిపాదిత 10 ప్రాంతాల్లో వాటర్ ఏరోడ్రోమ్‌ల అభివృద్ధి ద్వారా సీప్లేన్ సేవలను ప్రారంభించే అంశంపై సమావేశంలో ప్రస్తావించారు. అలాగే ప్రభుత్వ–ప్రైవేట్ భాగస్వామ్య (PPP) విధానంలో జాయింట్ డెవలప్‌మెంట్ నమూనాల ద్వారా హెలిపోర్టుల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వ సహకారాన్ని మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి కోరారు.

జాయింట్ వెంచర్లు (JV), ప్రాంతీయ అనుసంధాన పథకం (RCS) కింద స్థానిక విమానాశ్రయాల అభివృద్ధి, భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా వర్టీపోర్ట్ వంటి అధునాతన వైమానిక మౌలిక సదుపాయాల ఏర్పాటుకు రాష్ట్రంలో ఉన్న అవకాశాలపై కూడా ఇరు మంత్రులు చర్చించారు.

ఆంధ్రప్రదేశ్‌ను దేశంలో ప్రముఖ ఏవియేషన్ హబ్‌గా తీర్చిదిద్దే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి పేర్కొన్నారు. ఏరోస్పేస్ తయారీ, మెయింటెనెన్స్, రిపేర్ అండ్ ఓవర్‌హాల్ (MRO), ఏవియేషన్ శిక్షణ, లాజిస్టిక్స్, అనుబంధ పరిశ్రమల ఏర్పాటుతో పాటు భవిష్యత్ తరాల అవసరాలకు అనుగుణమైన సమగ్ర ఏవియేషన్ ఎకోసిస్టమ్‌ను రాష్ట్రంలో అభివృద్ధి చేయడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు.

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రంలో రాబోయే 20 ఏళ్ల అవసరాలను దృష్టిలో ఉంచుకుని విమానాశ్రయాల నిర్మాణానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని మంత్రి తెలిపారు. ముఖ్యమంత్రి మార్గనిర్దేశకత్వంలో రాష్ట్రంలోని ప్రతి 150 కిలోమీటర్ల పరిధిలో ఒక విమానాశ్రయం ఏర్పాటు చేయాలనే వ్యూహాత్మక లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని వివరించారు.

ఈ సమావేశంలో ఆర్ అండ్ బీ, ఐ అండ్ ఐ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎం.టి. కృష్ణబాబు, మారిటైమ్ బోర్డు సీఈవో ప్రవీణ్ ఆదిత్యతో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఎన్.ఐ.డి. ప్రాంగణంలో 12వ జాతీయ చేనేత దినోత్సవ ముందస్తు వేడుకలు

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : అమరావతి సమీపంలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ (NID) ప్రాంగణంలో 12వ జాతీయ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *