Breaking News

నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మేంట్(NIDM) కొండపావులూరులో రెండు రోజుల వర్కషాప్

-హాస్పిటల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ ప్లానింగ్ (HDMP)పై వర్క్‌షాప్ ప్రారంభం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
హాస్పిటల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ ప్లానింగ్ (HDMP) పై రెండు రోజుల వర్కషాప్ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మేంట్(NIDM) సౌత్ క్యాంపస్ కొండపావులూరులో ప్రారంభమైంది. విపత్తులు మరియు ప్రజారోగ్య అత్యవసర సమయాల్లో ప్రజల ప్రాణాలను కాపాడటంలో హాస్పిటల్స్ కీలకమైన జీవనాధారాలని ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ(APSDMA) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కౌసర్ బానో పేర్కొన్నారు. కార్యక్రమంలో విపత్తుల సంస్థ సిబివో రామాయణపు తనూజ, ప్రాజెక్టు మేనేజర్ బస్వంత్ రెడ్డి, యూనిసెఫ్ ప్రసాద్ పాల్గొన్నారు.

ఆసుపత్రుల భద్రతను పటిష్టం చేయడం, అత్యవసర సన్నద్ధతను పెంచడం, పటిష్టమైన కార్యాచరణ ప్రణాళికలను రూపొందించుకోవడం ద్వారానే సంక్షోభ సమయాల్లోనూ అంతరాయం లేని వైద్య సేవలను అందించడం సాధ్యమవుతుందన్నారు.

ఈ సదస్సుకు హాజరైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ మరియు పుదుచ్చేరి రాష్ట్రాల విపత్తు నిర్వహణ సంస్థలు, ఆరోగ్య శాఖల మధ్య సమన్వయాన్ని మరింత బలోపేతం చేయడానికి, ఉత్తమ పద్ధతులను పరస్పరం పంచుకోవడానికి ఒక అద్భుతమైన వేదికగా నిలుస్తుందని ఈడీ కౌసర్ బానో ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రతినిధులంతా ఈ రెండు రోజుల వర్క్‌షాప్ లో చర్చించిన అంశాలను తమ తమ రాష్ట్రాల్లో మరియు వైద్య సంస్థల్లో సమర్థవంతంగా అమలు చేయాలన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఎన్.ఐ.డి. ప్రాంగణంలో 12వ జాతీయ చేనేత దినోత్సవ ముందస్తు వేడుకలు

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : అమరావతి సమీపంలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ (NID) ప్రాంగణంలో 12వ జాతీయ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *