Breaking News

దళిత క్రైస్తవుల పేరుతో వైసీపీ ఆడిస్తున్న నాటకం వెనుక కుట్ర దాగి ఉంది… : సురేంద్రబాబు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సమతా సైనిక్ రాష్ట్ర అధ్యక్షులు సురేంద్రబాబు గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో శనివారం జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ వైసీపీ కి అనుబంధంగా పని చేస్తున దళిత పేటియం బ్యాచ్ ద్వారా రాష్ట్రంలో అశాంతి సృష్టించడమే కాక, దళితుల మీద సమాజంలో వ్యతిరేకత ఏర్పడే విధంగా తయారు చేస్తున్నాడని తెలిపారు.దళిత క్రైస్తవులకు SC హోదా అనే సమస్య ఇప్పటిది కాదు 1950 నుండి నలుగుతూనే ఉంది. ఎప్పుడైతే చంద్రబాబు ప్రభుత్వం వస్తుందో అప్పుడే వీళ్ళు, దళిత క్రైస్తవం పేరుతో డ్రామా మొదలు పెడతారు అని అన్నారు. దళిత క్రైస్తవుల నాయకులు అని చెప్పుకునే పీవీ సునీల్ కుమార్ ఆకివీడు పేరుతో గొడవలు పెట్టాడు,శ్రావణ్ కుమార్ క్రైస్తవ శంఖారావం పేరుతో గొడవలు పెడుతున్నాడనారు.వైసీపీ డైరెక్షన్ లో నడుస్తున్న వీళ్ళు ఇద్దరి పోరాటం, దళిత క్రైస్తవులకు హక్కుల కోసం కాదు.. ఆ పేరుతో గొడవలు సృష్టించి జగన్ రెడ్డికి లబ్ధి చేకూర్చాలని.. ఇటీవల శ్రవణ్ కుమార్ కూడా ఒక మీడియా సమావేశంలో చెప్పాడు.
ఈ గొడవ వల్ల జగన్ డైరెక్ట్ బెనిఫిషరీ కానీ మద్దతుగా ముందు రావట్లేదు అని ఇక ఆయన ఉపముఖ్యమంత్రి అవుతా అనడంలోనే ముఖ్యమంత్రి జగన్ రెడ్డి అని చెప్పకనే చెబుతున్నాడు.. వీళ్ళంతా మాటల్లో 2029 లో వైసీపీ వస్తె మీకు రప్ప రప్పా నరుకుంటాం అనడంలోనే.. వీళ్ళు వైసీపీ కోసం పని చేసే దొంగ నాయకులు అని స్పష్టంగా తెలుస్తుంది.. ఈ దేశంలో ఎక్కడా దళిత క్రైస్తవులకు ప్రత్యేక రిజర్వేషన్లు లేవు.. కేంద్రం ఇవ్వకపోయినా.. నేను ఇస్తాను అంటూ.. కన్వర్టెడ్ క్రిస్టియన్స్ కోసం 1999 లో బీసీ – సి కేటగిరి ఏర్పాటు చేసి చేశాడు చంద్రబాబు.. దీనితో పాటు.. దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 2003 లో, మళ్ళీ విభాజిత ఆంధ్రప్రదేశ్ లో 2017 లో మరోసారి అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానాలు చేసి కేంద్రానికి పంపారు.. వాటి ఆధారంగానే నరేంద్రమోడీ ప్రభుత్వం.. కేజీ. బాలకృష్ణన్ కమీషన్ ను ఏర్పాటు చేసింది.దళిత క్రైస్తవుల కోసం జగన్ రెడ్డి కానీ, అతని తండ్రి రాజశేఖరరెడ్డి కానీ చేసింది ఏమీ లేదు.. వాడుకుని వదిలేయడం తప్ప కూటమిఆ ప్రభుత్వం పై, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పై వైసీపీ చేస్తున్న కుట్రను తీవ్రంగా ఖండిస్తున్నాం అన్నారు. ఈ సమావేశంలో ఆర్గనైజింగ్ సెక్రటరీ యర్రం సునీల్ కుమార్, ఏపీ రాష్ట్ర సోషల్ మీడియా కన్వీనర్ సిద్ధం అశోక్ పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఎన్.ఐ.డి. ప్రాంగణంలో 12వ జాతీయ చేనేత దినోత్సవ ముందస్తు వేడుకలు

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : అమరావతి సమీపంలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ (NID) ప్రాంగణంలో 12వ జాతీయ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *