Breaking News

ఏపీ అందాలను వెండితెరపై చూపించిన ‘చెన్నై లవ్ స్టోరీ’ టీమ్‌కు మంత్రి కందుల దుర్గేష్ అభినందనలు

-విజయవాడ రాజ్ యువరాజ్ థియేటర్ లో ‘చెన్నై లవ్ స్టోరీ’ నాల్గవ సాంగ్ ‘హోయిలా’ విడుదల చేసిన మంత్రి కందుల దుర్గేష్,డిప్యూటీ స్పీకర్ రఘు రామకృష్ణంరాజు
-ఏపీలో సినిమా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటుకు ముందుకు రావాలి: మంత్రి కందుల దుర్గేష్ పిలుపు!
-జులై 24న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవ్వాలని ఆకాంక్షించిన మంత్రి దుర్గేష్
-సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నాయకత్వంలో పరిశ్రమకు పూర్తి సహకారం: మంత్రి కందుల దుర్గేష్.
-షూటింగుల అనుమతులు వేగంగా ఇచ్చినందుకు కూటమి ప్రభుత్వానికి చిత్ర యూనిట్ కృతజ్ఞతలు!

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సినిమా పరిశ్రమ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. శనివారం విజయవాడలోని రాజ్ యువరాజ్ థియేటర్లో మాస్ మూవీ మేకర్స్, అమృత ప్రొడక్షన్స్ బ్యానర్లపై ఎస్.కె.ఎన్, సాయి రాజేష్ నిర్మాణ సారథ్యంలో, రవి నంబూరి దర్శకత్వంలో కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరీ ప్రియ జంటగా నటించిన చిత్రం ‘చెన్నై లవ్ స్టోరీ’ లోని ‘హోయిలా’ సాంగ్‌ను ముఖ్య అతిథులుగా హాజరై సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు విడుదల చేసారు..

ఈ సందర్భంగా సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ…”కూటమి ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ల నాయకత్వంలో చిత్ర పరిశ్రమకు ఎల్లప్పుడూ అండగా ఉంటుంది. స్వయానా కళాకారుడైన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆశీస్సులు ఈ సినిమాకు ఉండాలని కోరుకుంటున్నాను. ఈ చిత్రంలో మెలోడీ బ్రహ్మ మణిశర్మ అందించిన మెలోడీలు చాలా బాగున్నాయి.దర్శకుడు సాయి రాజేష్ అందించిన కథ అద్భుతం. హీరో కిరణ్ అబ్బవరం పక్కింటి కుర్రాడిలా చాలా సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. హీరోయిన్ శ్రీ గౌరీ ప్రియ నేచురల్ ఎక్స్‌ప్రెషన్స్‌తో మెప్పించారు. చీరాల, బాపట్ల, సూర్యలంక బీచ్ ల వంటి ఆంధ్రప్రదేశ్ లోని అందమైన లొకేషన్లలోనే ఈ సినిమా షూటింగ్ అంతా జరుపుకోవడం చాలా సంతోషకరం. ఏపీ అందాలను సెల్యులాయిడ్ మీద అద్భుతంగా చూపించిన చిత్ర యూనిట్‌కు హాట్సాఫ్. మన రాష్ట్రంలో షూటింగులకు సింగిల్ విండో ద్వారా త్వరతగతిన పర్మిషన్లు ఇస్తున్నాం. పరిశ్రమ ప్రముఖులు ఏపీలో సినిమా ఇన్ఫ్రాస్ట్రక్చర్ (స్టూడియోలు, పోస్ట్ ప్రొడక్షన్ సౌకర్యాలు) ఏర్పాటు చేయడానికి ముందుకు రావాలని పిలుపునిస్తున్నాను, ప్రభుత్వం నుంచి సంపూర్ణ సహకారం ఉంటుంది. తెలుగు సినిమా మరింత విశ్వవ్యాప్తం కావాలి.” అని పేర్కొన్నారు.

చిత్ర బృందం మాట్లాడుతూ..
“తొలిప్రేమ గొప్పదే కానీ, అదే జీవితం కాదు” అనే ఒక వినూత్నమైన, వాస్తవిక ప్రేమకథా కోణంలో ఈ చిత్రాన్ని డెబ్యూ డైరెక్టర్ రవి నంబూరి తెరకెక్కించారని తెలిపారు. ఇప్పటికే విడుదలైన టీజర్, గ్లింప్స్, మూడు పాటలకు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చిందని, ఈ చిత్రానికి ఏపీలోనే ఎక్కువ షూటింగ్ జరుపుకున్నామని, షూటింగ్ అనుమతుల కోసం తాము ఏది అడిగినా సింగిల్ విండో ద్వారా అత్యంత త్వరగా పర్మిషన్లు ఇచ్చినందుకు మంత్రి కందుల దుర్గేష్ కి, కూటమి ప్రభుత్వానికి చిత్ర నిర్మాత లైన ఎస్.కె.ఎన్, సాయి రాజేష్ మరియు చిత్ర యూనిట్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

అంతకుముందు థియేటర్ యాజమాన్యం మంత్రి దుర్గేష్‌ కి ఘన స్వాగతం పలికింది. చిత్ర బృందం తెరకెక్కించిన పాటలను ఆసక్తిగా తిలకించిన అతిథులు, జులై, 24 న విడుదల అవుతున్న ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని ఆకాంక్షించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఎన్.ఐ.డి. ప్రాంగణంలో 12వ జాతీయ చేనేత దినోత్సవ ముందస్తు వేడుకలు

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : అమరావతి సమీపంలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ (NID) ప్రాంగణంలో 12వ జాతీయ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *